తూకం.. మోసం!
ABN , Publish Date - Dec 08 , 2025 | 11:57 PM
పిఠాపురం/గొల్లప్రోలు రూరల్, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని ప్రభుత్వ పట్టుగూళ్ల విక్రయ కేంద్రం (పట్టు మార్కెట్)లో తూనికల విషయంలో మోసం జరుగుతుందంటూ రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. పట్టు మార్కెట్‌లో ఉ న్న వెయింగ్ మిషన్‌ను మూడు సంవత్స
చేబ్రోలు పట్టు మార్కెట్‌లో తూనికల మోసం
100 కిలోలకు 2.50 కిలోల తరుగు
పట్టు రైతుల ఆందోళన
పిఠాపురం/గొల్లప్రోలు రూరల్, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని ప్రభుత్వ పట్టుగూళ్ల విక్రయ కేంద్రం (పట్టు మార్కెట్)లో తూనికల విషయంలో మోసం జరుగుతుందంటూ రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. పట్టు మార్కెట్‌లో ఉ న్న వెయింగ్ మిషన్‌ను మూడు సంవత్సరాలుగా తూనికల కొలతల శాఖకు తనిఖీల ని మిత్తం పంపకుండా పట్టు పరిశ్రమల శా ఖల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని వారు ఆరోపించారు. దీని వల్ల పట్టుగూళ్లు బరువు 100 కిలోలకు 2.50 కిలోలు తక్కువగా చూపిస్తున్నదని తెలిపా రు. 50కిలోల తూకం రాళ్లు తీసుకువచ్చి మిషన్‌పై వేయగా 48.88 కిలోలు మాత్రమే చూపించడాన్ని వారు గుర్తించారు. తూకం లో మోసంతో తాము లక్షలాది రూపాయిలను నష్టపోయామని, దీనికి బాధ్యులైన అధికారులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గొల్లప్రోలు మండలం చేబ్రోలు సెరీకల్చర్ ఫారమ్, పిఠాపురం పట్టణంలోని పాడా కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. మూడు సంవత్సరాలుగా నష్టపోయిన తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం పాడా ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. ఆందోళనలో రైతులు సీహెచ్.చక్రబాబు, రామకృష్ణ. ఉలవకాయల రాంబాబు, నల్లరావుల ఏసుబా బు, ఓ.ఏసు బాబు, గంగాధర్, శ్రీను, రామారావు, సూరిబాబు, శివ, వెంకటరమణ తదితరులు ఉన్నారు.