Share News

అజాత శత్రువు అటల్‌జీ

ABN , Publish Date - Dec 22 , 2025 | 01:44 AM

రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 21 (ఆ ంధ్రజ్యోతి): దేశంలో అజాత శత్రువుగా కీర్తి నొం దిన మహనీయుడు మాజీ ప్రధాని అటల్‌ బిహా రి వాజపేయి అని ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌సాయి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఏవిఏ రోడ్డు జాగృతి సెంటర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం సహకారంతో ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని వాజపేయి విగ్రహాన్ని ఆదివారం విష్ణుదేవ్‌సాయి ముఖ్యఅతిథిగా హాజరై ఆవిష్కరించారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్‌ వర్మ, రాష్ట్ర మంత్రులు సత్యకుమార్‌ యాదవ్‌, కందుల దుర్గేష్‌, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు

అజాత శత్రువు అటల్‌జీ
విగ్రహఆవిష్కరణలో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు

ఆయన వల్లే ఛత్తీస్‌గఢ్‌ ఏర్పడింది

ఛత్తీస్‌గఢ్‌ సీఎం విష్ణుదేవ్‌సాయి

రాజమహేంద్రవరంలో వాజపేయి విగ్రహావిష్కరణ

పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు

రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 21 (ఆ ంధ్రజ్యోతి): దేశంలో అజాత శత్రువుగా కీర్తి నొం దిన మహనీయుడు మాజీ ప్రధాని అటల్‌ బిహా రి వాజపేయి అని ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌సాయి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఏవిఏ రోడ్డు జాగృతి సెంటర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం సహకారంతో ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని వాజపేయి విగ్రహాన్ని ఆదివారం విష్ణుదేవ్‌సాయి ముఖ్యఅతిథిగా హాజరై ఆవిష్కరించారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్‌ వర్మ, రాష్ట్ర మంత్రులు సత్యకుమార్‌ యాదవ్‌, కందుల దుర్గేష్‌, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర అ ధ్యక్షుడు పీవీఎస్‌ మాధవ్‌, రాజ్యసభ సభ్యుడు పాకా వెంకటసత్యనారాయణ, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్రతో కలిసి వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు. తొలుత బీజేపీ జెండాను ఎగురువేశారు. అనంతరం బహిరంగ సభలో సీఎం విష్ణుదేవ్‌సాయి మాట్లాడుతూ అటల్‌ -మోదీ సుపరిపాలన బస్‌ యాత్ర ద్వారా రాజమహేంద్రవరం రావడం, అటల్‌ విగ్రహాన్ని ఆవిష్కరిండం చాలా ఆనందంగా ఉందన్నారు. అటల్‌జీ వల్లే ఛత్తీస్‌గఢ్‌ ఏర్పడిందన్నారు. అందుకే ఆ మహానీయుడి పేరిట రాష్ట్ర రాజధాని అటల్‌ నగర్‌గా నామకరణం చేశామన్నారు. ఏపీలోకి తాను రాగానే కూటమి పార్టీల నాయకులు స్వాగ తం పలికిన తీరు చూస్తే సీఎం చంద్రబా బు, డిప్యూటీ సీఎం పవన్‌తో మా స్నేహం ఎంత బలంగా ఉందో అర్థమైందన్నారు. ఆంధ్రప్రదేశ్‌తో ఛత్తీస్‌గఢ్‌ స్నేహసంభందాలు మరింత బలపడతాయన్నారు. ఆంధ్రా నుంచి ఛత్తీస్‌గఢ్‌ రాజధాని అటల్‌ నగర్‌కు చేరుకోవడానికి కేవలం 5 గంటలు మాత్రమే పట్టేవిధంగా రహదారి నిర్మాణం జరుగుతుందన్నారు. గోదావరి ప్రాంతంలో అటల్‌జీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన మాధవ్‌, పార్టీ నాయకులకు అభినందనలు తెలిపారు. కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్‌వర్మ మాట్లాడుతూ భారతదేశం గర్వించ దగ్గ నాయకుడు భారత్న అటల్‌ బిహారివాజ పేయి అని అన్నారు. మంత్రి కందుల మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో అటల్‌జీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా స్ఫూర్తిదాయకమన్నారు. మంత్రి సత్యకుమార్‌ మాట్లాడు తూ అతి సాధారణ కుటుంబంలో పుట్టి అస మా న స్థాయికి ఎదిగిన నాయకుడు వాజపేయి అని అన్నారు. పురందేశ్వరి మాట్లాడుతూ అటల్‌జీ శ తజయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టామన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు బొమ్ముల దత్తు, పొట్లూరి రామ్మోహనరావు, అడబాల రామకృష్ణారావు, దర్వాడ రా మకృష్ణ, టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, జనసేన నగర అధ్యక్షుడు వైశ్రీనివాస్‌ ఉన్నారు.

Updated Date - Dec 22 , 2025 | 01:44 AM