Share News

జీవనశైలిలో మార్పులతో హైబీపీ నియంత్రణ

ABN , Publish Date - May 18 , 2025 | 12:55 AM

వయస్సుతో సంబంధంలేకుండా అనేక మంది యుక్తవయస్సులోనే అధిక రక్తపోటు బారిన పడుతున్నారని, జీవనశైలిలో మార్పులతో రక్తపోటు నియంత్రించవచ్చని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ కె.వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం ప్రపంచ అధిక రక్తపోటు దినం (హైపర్‌ టెన్షన్‌ డే) సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.

జీవనశైలిలో మార్పులతో హైబీపీ నియంత్రణ
ర్యాలీ ప్రారంభిస్తున్న డాక్టర్‌ వెంకటేశ్వరరావు

  • డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటేశ్వరరావు

రాజమహేంద్రవరం అర్బన్‌, మే 17 (ఆంధ్రజ్యోతి): వయస్సుతో సంబంధంలేకుండా అనేక మంది యుక్తవయస్సులోనే అధిక రక్తపోటు బారిన పడుతున్నారని, జీవనశైలిలో మార్పులతో రక్తపోటు నియంత్రించవచ్చని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ కె.వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం ప్రపంచ అధిక రక్తపోటు దినం (హైపర్‌ టెన్షన్‌ డే) సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డాక్టర్‌ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలు తాము తీసుకునే ఆహారంలో చిన్నచిన్న మార్పులు చేసుకోవడంతోపాటు దైనందిన జీవన విధానాన్ని ఆరోగ్యకరంగా ఉంచుకోవాలని సూచించారు. అధికరక్తపోటుతో బాధపడుతున్నవారు సరైన సమయంలో మందులు తీసుకోవాలన్నారు. హై బీపీ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రతిగ్రామంలోనూ కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లు, ఆశ, ఏఎన్‌ఎంల ద్వారా ప్రచారం చేస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో పలువురు వైద్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 18 , 2025 | 12:55 AM