Share News

ఆనాటి ప్రయాణం.. నేటి ఉచితానికి మార్గం!

ABN , Publish Date - Aug 15 , 2025 | 12:17 AM

ఆలమూరు, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మహిళలందరికీ ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్ర వారం నుంచి ఈ పథకం అమలులోకి వచ్చింది. స్త్రీశక్తి పేరుతో ఈ పథకాన్ని రూపొందించారు. పల్లె వెలుగు, ఆలా్ట్ర పల్లె వెలుగు, సీటి ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ 5 రకాల బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడైనా ఉచితంగా మహిళలు

 ఆనాటి ప్రయాణం.. నేటి ఉచితానికి మార్గం!
ఆలమూరులో రెండేళ్ల క్రితం బస్సులో ప్రయాణం చేసిన చంద్రబాబు

కోనసీమ జిల్లా ఆలమూరులో రెండేళ్ల క్రితం

ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన చంద్రబాబు

ఉచిత బస్సు సౌకర్యం హామీపై ప్రయాణికులతో చర్చ

స్త్రీ శక్తి పథకానికి అదే స్ఫూర్తి

ఆలమూరు, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మహిళలందరికీ ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్ర వారం నుంచి ఈ పథకం అమలులోకి వచ్చింది. స్త్రీశక్తి పేరుతో ఈ పథకాన్ని రూపొందించారు. పల్లె వెలుగు, ఆలా్ట్ర పల్లె వెలుగు, సీటి ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ 5 రకాల బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడైనా ఉచితంగా మహిళలు ప్రయాణించవచ్చు. ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు డాక్టర్‌ బీఆర్‌ కోనసీమ జిల్లా ఆలమూరు మండల పర్యటనకు వచ్చినప్పుడు ఆలమూరు నుంచి జొన్నాడ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ఉచిత బస్సు సౌకర్యం హామీకి సంబంధించి మహిళా ప్రయాణికులతో చర్చించారు. 2023 ఆగస్టు 18న ఈ బస్సు ప్రయాణం చేశారు. ఈ పథకం రూపకల్పనకు సంబంధించి అనేక మంది మహిళా ప్రయాణికులతో ఆయన సమీక్షించి సూపర్‌ సిక్స్‌ హామీగా చేర్చా రు. ఇప్పుడు ఆ పథకం అమలు చేస్తుండడంతో కొత్తపేట నియోజకవర్గంలో అప్పటి చంద్రబాబు ఆల మూరు బస్సు ప్రయాణం గుర్తించి చ ర్చించుకుంటున్నారు. ఉచిత బస్సు పథకానికి ఆలమూరు బస్సు ప్రయాణం స్ఫూర్తిగా భావిస్తున్నారు. ఆ ప్రయాణంలో చంద్రబాబు నాయుడుతో పాటు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, అమలాపురం ఎంపీ గంటి హరీష్‌మాధుర్‌, మాజీ జడ్పీటీసీ దండంగి మమత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 15 , 2025 | 12:17 AM