Share News

చైన్‌స్నాచర్లు... చిక్కారు!

ABN , Publish Date - Dec 21 , 2025 | 01:20 AM

కాకినాడ క్రైం, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): తెల్లవారుజామున వాకిట్లో ముగ్గు వేసే మహిళలు, ఉదయాన్నే ఆలయాలకు నడిచి వెళ్లే వృ ద్ధులే వారి టార్గెట్‌. బైక్‌పై వెనుక నుంచి వేగంగా వచ్చి రెప్పపాటులో మహిళలు, వృద్ధులు మెడలోని బంగారు ఆభరణాలను తస్కరించి మాయమవుతారు. ఈ విధంగా కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జి ల్లాల్లో నలుగురు యథేచ్ఛగా మొత్తం 24 చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడి తప్పించుకు

చైన్‌స్నాచర్లు... చిక్కారు!
స్వాధీనం చేస్తున్న చోరీ సొత్తును పరిశీలిస్తున్న కాకినాడ జిల్లా ఎస్పీ

మహిళలు, వృద్ధులే లక్ష్యంగా చోరీలు

నలుగురు నిందితులను పట్టుకున్న

కాకినాడ జిల్లా పోలీసులు

రూ. 58 లక్షల విలువైన

చోరీ సొత్తు స్వాధీనం, 5 బైక్‌లు సీజ్‌

వివరాలు వెల్లడించిన

కాకినాడ ఎస్పీ బిందుమాధవ్‌

కాకినాడ క్రైం, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): తెల్లవారుజామున వాకిట్లో ముగ్గు వేసే మహిళలు, ఉదయాన్నే ఆలయాలకు నడిచి వెళ్లే వృ ద్ధులే వారి టార్గెట్‌. బైక్‌పై వెనుక నుంచి వేగంగా వచ్చి రెప్పపాటులో మహిళలు, వృద్ధులు మెడలోని బంగారు ఆభరణాలను తస్కరించి మాయమవుతారు. ఈ విధంగా కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జి ల్లాల్లో నలుగురు యథేచ్ఛగా మొత్తం 24 చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడి తప్పించుకుని తిరుగుతున్నారు. చివరికి కాకినాడ జిల్లా పోలీసులకు చిక్కా రు. నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు వారి నుంచి మొత్తం రూ.58 లక్షల విలువైన చోరీసొత్తు స్వాధీనం చేసుకుని, 5 బైక్‌లను సీజ్‌ చేశారు. కాకినాడ జిల్లా పోలీస్‌ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ జి.బిందుమాధవ్‌ నిందితుల వి వరాలను వెల్లడించారు.

ఎస్పీ ప్రత్యేక దృష్టి...

గత మూడేళ్లుగా కాకినాడ జిల్లాలోని కాజులూరు, తాళ్లరేవు, కరప మండలాల్లో తరచూ చైన్‌స్నాచింగ్‌లు జరుగుతున్న నేపథ్యంలో ఎస్పీ బిందుమాధవ్‌ ప్రత్యేక దృష్టి సారించారు. ఆయన ఆదేశానుసారం కాకినాడ ఎస్‌డీపీవో పాటిల్‌ దేవరాజ్‌ మనీష్‌ పర్యవేక్షణలో కాకినాడ రూరల్‌ సీఐ డిఎస్‌ చైతన్యకృష్ణ ఆధ్వర్యంలో గొల్లపాలెం, కోరం గి, కరప పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి నిఘా పటిష్టం చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

సులువుగా డబ్బు సంపాదించాలని..

ఈ క్రమంలో శుక్రవారం రాత్రి పెట్రోలింగ్‌ చేస్తున్న పోలీసులకు కాజులూరు మండలం కోలంక శివారు గొప్పిరేవు వంతెన నుంచి నామవానిపాలెనికి నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తుండడాన్ని పోలీసులు గమనించి అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పరదేశమ్మపేటకు చెందిన 34 ఏళ్ల మల్లాడి విజయకుమార్‌ అలియాస్‌ విజయ్‌, అదే మండ లం సీతారాంపురం గ్రామానికి చెందిన 29 ఏళ్ల పెసింగి రాధాకృష్ణ, అదే ప్రాంతానికి చెందిన 43 ఏళ్ల పరంశెట్టి బుజ్జి వెంకటదుర్గారావు అలియాస్‌ రమణ, కాకినాడ జగన్నాధపురం అబ్దుల్‌ కలాం నగర్‌కు చెందిన 34 ఏళ్ల మల్లాడి సతీష్‌లుగా గుర్తించి నట్టు ఎస్పీ వెల్లడించారు. విజయ్‌ కారు డ్రైవర్‌గా... రాధాకృష్ణ, దుర్గారావు కార్పెంటర్‌లు గా, సతీష్‌ చేపల వేట చేస్తూ జీవనం సాగించే వారు. అయితే ఈ నలుగురు స్నేహితులయ్యాక కష్టపడకుండా సులువుగా డబ్బు సంపాదించాలనే దురాశతో చైన్‌స్నాచింగ్‌లను ప్రవృత్తిగా మార్చుకున్నట్టు ఎస్పీ తెలిపారు. 2022 నుంచి గొల్లపాలెం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 7 చైన్‌స్నాచింగ్‌ లు, కోరంగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 7, కరప పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 4, ఇంద్రపాలెం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 1, ద్రాక్షరామ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 21, పామర్రు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 2, అనపర్తి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 1 ఈ ముఠా స్నాచింగ్‌లకు పాల్పడినట్లు ఎస్పీ వెల్లడించారు.

బైక్‌లను కూడా...

అంతే కాకుండా ఈ ముఠా చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడేందుకు కావాల్సిన బైక్‌లను పామర్రు పో లీస్‌స్టేషన్‌ పరిధిలో 1, కోరంగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 2, పెదపూడి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 1, ఇం ద్రపాలెం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 1 దొంగిలించిన ట్టు ఎస్పీ పేర్కొన్నారు. నిందితులను చాకచక్యం గా పట్టుకుని చోరీ సొత్తును రికవరీ చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన గొల్లపాలెం ఎస్‌ఐ ఎం.మోహన్‌కుమార్‌, హెచ్‌సీలు గొప్పు నరసింగరావు అలియాస్‌ చిన్న, సీహెచ్‌వివి నారాయణరె డ్డి, పీవి.రమణ, పీసీలు ఏ.చంద్రశేఖర్‌, ఎం.శివ ప్రసాద్‌, బూలా శ్రీనివాసరావు, జివి.రమణ, ఎన్‌ శ్రీనివాసరావు, వైజిఎస్‌ఎన్‌.మూర్తి, పి.గోవిందరాజులు, హెచ్‌జి వి.శివ, కేసును చేధించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించిన ఐటీ కోర్‌ సీఐ డి.దుర్గాశేఖర్‌ రెడ్డి, పీసీలు పి.నూకరాజు, స్వామీలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. నిందితులను కాకినాడ మూడో ఏజెఎఫ్‌సిఎం కోర్టులో హాజరుపర్చనున్నట్టు ఎస్పీ వెల్లడించారు.

Updated Date - Dec 21 , 2025 | 01:20 AM