కామెర్ల మందు సృష్టికర్త సూర్యారావుకు పద్మ అవార్డు అందించేలా కృషి
ABN , Publish Date - Apr 30 , 2025 | 12:47 AM
ద్రాక్షారామ, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): ప్రాణాంతక కామెర్ల వ్యాధికి వందేళ్ల క్రితం ప్రకృతి వై ద్యం ద్వారా మందును సృష్టించి లక్షలాది మంది ప్రాణాలను కాపాడిన దివంగత గుండుబోగుల సూర్యారావుకు పద్మ అవార్డు అందించడానికి కృషి చేస్తానని, కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా నని కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కుశాఖ సహా య మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొ న్నారు. మంగళవారం రాత్రి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం
కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ
ద్రాక్షారామ, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): ప్రాణాంతక కామెర్ల వ్యాధికి వందేళ్ల క్రితం ప్రకృతి వై ద్యం ద్వారా మందును సృష్టించి లక్షలాది మంది ప్రాణాలను కాపాడిన దివంగత గుండుబోగుల సూర్యారావుకు పద్మ అవార్డు అందించడానికి కృషి చేస్తానని, కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా నని కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కుశాఖ సహా య మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొ న్నారు. మంగళవారం రాత్రి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండ లం వెల్లలో కామెర్ల మందు పంపిణీకి వందేళ్లు పూర్తయిన సందర్భంగా గుండుబోగుల సూర్యారావు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శతాబ్ధి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కేంద్ర మం త్రి మాట్లాడుతూ కామెర్ల వ్యాధికి ఇంగ్లీషు మం దు అందుబాటులో లేని కాలంలో వెల్ల మందు సంజీవనిగా నిలిచిందన్నారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా సేవా భావంతో సూర్యారావు చేసి న సేవలతో వెల్ల మందు ద్వారా వెల్లకు జాతీ యస్థాయిలో గుర్తింపు వచ్చిందన్నారు. వందేళ్ల క్రితం ప్రారంభించిన వెల్ల మందును సూర్యారావు వంశీకులు కొనసాగించడం అభినందనీయమన్నారు. సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ ప్రకృ తి వైద్యం ద్వారా కామెర్లకు మందును పంపిణీ చేసి లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన సూర్యారావుకు పద్మ అవార్డుకు ప్రభుత్వం పరిశీలన చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. దీనిపై కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ మాట్లాడుతూ ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించిన తరువాత కళాకారులు, ప్రకృతి వ్యవసాయం, ప్రాచీన కళలను కొనసాగిస్తున్న అనేకమందిని ఎంపిక చేసి పద్మ అవార్డులు అందిం చడం జరుగుతుందన్నారు. కామెర్ల మందు కనుగొని ప్రాణాలు కాపాడిన సూర్యారావు పద్మ అవార్డుకు పూర్తి అర్హులని, వందేళ్లుగా కామెర్ల వైద్యానికి అందిస్తున్న సేవలను ఫైల్ రూపంలో అందిస్తే ప్రధాని దృష్టికి తీసుకువెళ్తా నన్నారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ వందేళ్ల క్రితం మందు పంపిణీ ప్రారంభించి నేటికీ పది రూ పాయిలకే అందించడం అభినందనీయమని, ఈ సేవను మరో వందేళ్లు కొనసాగించాలని కోరారు. కామెర్ల వైద్య నిలయం వెబ్‌సైట్, డిజిటల్ సైట్, ఎన్జీవో సైట్‌లను శ్రీనివాసవర్మ, సుభాష్, ఎమ్మె ల్సీ సోము వీర్రాజు ఆవిష్కరించారు. సమావేశంలో మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, మున్సిపల్ చైర్మన్ గాదంశెట్టి శ్రీదేవి, ఎంపీపీ అంబటి భవాని, జనసేన ఇన్‌చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, చిక్కాల దొరబాబు, గుండుబోగుల సూర్యారావు మనుమలు, కుటుంబీకులు, గ్రామస్థులున్నారు.