Share News

అజాత శత్రువు వాజపేయి

ABN , Publish Date - Dec 01 , 2025 | 12:29 AM

మండపేట, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): దేశ ప్రధానిగా పనిచేసిన దివంగత అటల్‌ బిహరీ వాజ్‌ పేయి రాజకీయాల్లో అజాత శత్రువని, ప్రధానిగా ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిన మ హోన్నత వ్యక్తి అని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ అన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీ

అజాత శత్రువు వాజపేయి
సభలో మాట్లాడుతున్న కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ, హాజరైన ప్రజాప్రతినిధులు, కూటమి నేతలు

ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన మహోన్నతుడు : కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ

వాజపేయికి మండపేటతో విడదీయని బంధం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌

ఏపీలోనే తొలిసారిగా మండపేటలో వాజపేయి విగ్రహం ఏర్పాటు

మండపేట, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): దేశ ప్రధానిగా పనిచేసిన దివంగత అటల్‌ బిహరీ వాజ్‌ పేయి రాజకీయాల్లో అజాత శత్రువని, ప్రధానిగా ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిన మ హోన్నత వ్యక్తి అని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ అన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మండపేటలో ఆది వారం వాజపేయి విగ్రహాన్ని రాజ మహేంద్రవరం ఎంపీతో కలిసి వారు ఆవిష్క రించారు. అనంతరం మండలంలోని తాపేశ్వరం వేడుక ఫంక్షన్‌హాల్‌లో బీజేపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు అడబాల సత్యన్నారాయణ అధ్యక్షత న జరిగిన ఆవిష్కరణ సభకు కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కూటమి నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ మాట్లాడుతూ దేశప్రధానిగా స్వర్ణభూజ్‌ పథకం గ్రామాల్లో రహదారుల నిర్మాణం, విద్య, వైద్య టెలికాంరంగాలకు వాజపేయి ఇచ్చిన ప్రాధాన్యతను వివరించారు. దేశ సమగ్ర అభివృద్ధికి అనేక సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తుచేశారు. జాతీయ రహదారుల అభివృద్ధి, విమానయానం ప్రపంచ దేశాలతోపాటు అణుబాంబు తయారీ చేయడం వంటి విషయాల్లో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న ధైర్యశాలీ వాజపేయి అని మాధవ్‌ అన్నారు. వాజపేయికి మండపేటతో విడదీయరానీ బంధం ఉందన్నారు. మండపేటకు 1983లో వాజపేయి వచ్చినపుడు బీజేపీ సీనియర్‌ నాయకుడు వల్లూరి పార్ధసారది ఇంట ఆతిథ్యం స్వీకరించిన విషయా న్ని మాధవ్‌ గుర్తుచేశారు. మండపేటలో బీజేపీనేతలు ఏర్పాటు చేసిన వాజపేయి విగ్రహం రాష్ట్రంలోనే తొలి విగ్రహమని, ఇక్కడ బీజేపీ శ్రేణుల స్ఫూర్తితో రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రా ల్లో విగ్రహాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వాజపేయి శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామన్నారు. సభలో మం డపేట, అనపర్తి ఎమ్మెల్యేలు వేగుళ్ల జోగేశ్వరరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఏపీఐడీసీ చైర్మ న్‌ వేగుళ్ల లీలాకృష్ణ, యాళ్ల దొరబాబు, సుబ్బారావు, కర్రి చిట్టిబాబు, మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అ య్యాజీవేమా, బీజేపీ కాకినాడ జిల్లా అధ్య క్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు తదితరులున్నారు.

Updated Date - Dec 01 , 2025 | 12:29 AM