సెంట్రల్ జైలులో ఇద్దరు జీవిత ఖైదీలకు క్షమాభిక్ష
ABN , Publish Date - Nov 11 , 2025 | 01:11 AM
రాజమహేంద్రవరం, నవంబరు 10 (ఆం ధ్రజ్యోతి): ప్రభుత్వం అర్హులైన జీవిత ఖైదీ లకు క్షమాభిక్ష ప్రసాదించింది. సోమవారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో 27వ అంశంగా హాంశాఖలోని జైళ్లశాఖ చెందిన అంశాన్ని ప్రవేశపెట్టారు. దీనిలో ముగ్గురు జీవిత ఖైదీలకు క్షమాభిక్ష కల్పించాల్సి ఉం
ఆమోదం తెలిపిన క్యాబినెట్
రాజమహేంద్రవరం, నవంబరు 10 (ఆం ధ్రజ్యోతి): ప్రభుత్వం అర్హులైన జీవిత ఖైదీ లకు క్షమాభిక్ష ప్రసాదించింది. సోమవారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో 27వ అంశంగా హాంశాఖలోని జైళ్లశాఖ చెందిన అంశాన్ని ప్రవేశపెట్టారు. దీనిలో ముగ్గురు జీవిత ఖైదీలకు క్షమాభిక్ష కల్పించాల్సి ఉంది. దీనికి జీవో ఎంఎస్ నెం.71 నిర్దేశించిన ప్రకా రం మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీనిలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజ మండ్రి సెంట్రల్‌లో జీవిత ఖైదు అనుభ విస్తున్న మధిరి సువర్ణరాజు, కటికిరెడ్డి నాగే శ్వరరావు విడుదల కానున్నారు. తూర్పుగో దావరి జిల్లా బిక్కవోలు మండలం కొమరిపాలేనికి చెందిన నాగేశ్వరరావు ఓ రైస్ మిల్లులో పని చేస్తుండేవాడు. కలెక్షన్ ఏజెం ట్‌ను హత్య చేసి సొమ్ము దోపిడీ చేశారనే నేరంపై రాజమండ్రిలోని కోర్టు జీవిత ఖైదు విధించగా 2011 మార్చి 21న జైలుకు వచ్చా డు. ఇతడు ఇప్పటి వరకూ పర్లో, పేరోల్‌పై బయటకు కూడా వెళ్లలేదు. అలాగే కృష్ణా జి ల్లా గుడ్లవల్లేరు మండలం చంద్రాల గ్రామా నికి చెందిన మదిరి సువర్ణరాజు భార్యను హత్య చేసిన కేసులో 2010 జూలై 15 నుంచి జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇతడి ప్రవ ర్తన ఆధారంగా సెమీ ఓపెన్ ఎయిర్ జైలు అర్హత పొందాడు. అయితే ప్రభుత్వం జీవో 2రోజుల్లో ఇచ్చే అవకాశం ఉంది. ఆ జీవో ఆధారంగా వీళ్లిద్దరూ స్వేచ్ఛా వాయువులు పీ ల్చుకొని కుటుంబాల చెంతకు చేరనున్నారు.