సెంట్రల్ జైలు ఖైదీ పరారీ
ABN , Publish Date - Sep 23 , 2025 | 12:49 AM
దేవరపల్లి, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెం ట్రల్ జైలు నుంచి వాయిదా నిమిత్తం విజయవాడ తీసుకెళ్లి తిరిగి రాజమహేంద్రవరం తీసు కొస్తున్న సమయంలో ఖైదీ బత్తుల ప్రభాకర్ పరారయ్యాడు. దేవరపల్లి మండలం దుద్దుకూరు జాతీయ రహ దారి పక్కనున్న గోదావరి రెస్టాం
దేవరపల్లి, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెం ట్రల్ జైలు నుంచి వాయిదా నిమిత్తం విజయవాడ తీసుకెళ్లి తిరిగి రాజమహేంద్రవరం తీసు కొస్తున్న సమయంలో ఖైదీ బత్తుల ప్రభాకర్ పరారయ్యాడు. దేవరపల్లి మండలం దుద్దుకూరు జాతీయ రహ దారి పక్కనున్న గోదావరి రెస్టాంట్ వద్ద టిఫిన్ చేసేందుకు సోమవారం రాత్రి ఎస్కార్ట్ వ్యాను ఆగింది. ఇదే అదునుగా భావించిన ప్రభాకర్ మూత్ర విసర్జన కోసం తీసుకెళ్లమని అడిగి తప్పించుకుని పరారయ్యాడు. దీనిపై దేవరపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ వి.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రభాకర్ కోసం గాలిస్తున్నామని, పోలీసుల నుంచి తప్పించుకున్న సమయంలో చేతికి సంకెళ్లు, వైట్ కలర్ టీషర్టు, బ్లాక్ కలర్ ట్రాక్‌ను ధరించి ఉన్నాడని, ఆచూకీ తెలిసినవారు 9440796584, 9440796624 నంబ ర్లలో సంప్రదించాలని కోరారు. ఆచూకీ తెలిపిన వారికి తగిన పారితోషికం అందజేస్తామన్నారు.