Share News

కేంద్ర బృందం రాకతో ఏర్పాట్లు ముమ్మరం

ABN , Publish Date - May 21 , 2025 | 12:34 AM

జిల్లాలో మూడు రోజులపాటు పర్యటించే సీనియర్‌ ఐఎఎస్‌ అధికారుల బృందం కోసం ద్వారపూడి పంచాయతీ ముస్తాబవుతోంది.

కేంద్ర బృందం రాకతో ఏర్పాట్లు ముమ్మరం

మండపేట, మే 20(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మూడు రోజులపాటు పర్యటించే సీనియర్‌ ఐఎఎస్‌ అధికారుల బృందం కోసం ద్వారపూడి పంచాయతీ ముస్తాబవుతోంది. నాలుగు రోజుల నుంచి మండలస్థాయి అధికారులతోపాటు పంచాయతీ కార్యదర్శులు ఆయా ఏర్పాట్ల లో నిమగ్నమయ్యారు. నాలుగు రోజుల నుంచి 40 మంది శానిటరీ సిబ్బంది గ్రామం లో పారిశుధ్య పనుల్లో నిమ గ్నమ య్యారు. పంచాయతీ కార్యదర్శి ఎవీవీ రమణ, డిప్యూటీ ఎంపీడీవో దాసరి శ్రీనివాస్‌ల ఆయా పను లను పర్యవేక్షిస్తున్నారు. అఽధికారులు పర్యటించే ఎస్సీ కాలనీలను అధికారులు శుభ్రం చేశారు. అధికారుల బృందం ఎంపిక చేసిన 17 పంచాయతీలు, 3 మున్సిపాల్టీల్లో వార్డుల్లో అధికారుల బృందం పర్యటన సాగనుంది. రెండు రోజులు రాత్రివేళ గ్రామాల్లో వారు బస చేయనున్నారు.

Updated Date - May 21 , 2025 | 12:34 AM