Share News

మొంథా నష్టంపై ప్రభుత్వానికి నివేదిక

ABN , Publish Date - Nov 11 , 2025 | 12:53 AM

రాష్ట్రంలో మొంథా తుఫాన్‌ నష్టాలపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని కేంద్ర బృందం ప్రకటించింది.

మొంథా నష్టంపై ప్రభుత్వానికి నివేదిక
చిట్యాలలో తుఫాన్‌ బాధిత రైతులతో మాట్లాడుతున్న కేంద్ర బృందం సభ్యులు, కలెక్టర్‌ కీర్తి తదితరులు

రాజమహేంద్రవరం/గోపాలపురం,నవంబరు 10 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో మొంథా తుఫాన్‌ నష్టాలపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని కేంద్ర బృందం ప్రకటించింది.కలెక్టరేట్‌లో సోమవారం రాత్రి జిల్లాలో జరిగిన నష్టంపై సమీక్షించింది.కలెక్టర్‌ కీర్తి చేకూరి ఆధ్వర్యంలో తుఫాన్‌ ప్రభావిత నష్టాలకు సంబంధించిన ఫొటో ప్రదర్శనను కేంద్ర బృందం తిలకించింది. కేంద్ర బృందం సభ్యుడైన కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ కె.పొన్నుస్వామి మాట్లాడుతూ చిట్యాల గ్రామం సహా పలు గ్రామాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. రైతు లు ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. సీడబ్యుసీ డైరెక్టర్‌ శ్రీనివాస బైరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాగం ప్రాణ నష్టం జరుగకుండా సమర్థవంతంగా వ్యవహరించారన్నారు. కలెక్టర్‌ కీర్తి చేకూరి జిల్లాలో నష్టాలు వివరించారు. జిల్లాలో వ్యవ సాయ, ఉద్యాన శాఖలకు భారీ నష్టం వాటిల్లిందన్నారు. జిల్లాలో 17 మండలాలు, 3 పట్టణాల పరిధిలో 653 గ్రామాలకు చెందిన 27,140 మంది ప్రజలు తుఫాన్‌ వల్ల నష్టపోయారన్నా రు. జిల్లాలో 31,074 మంది రైతులకు చెందిన 15665 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని తెలిపారు. అందులో 14529 హెక్టార్లలో వరి పంట, 1135 హెక్టార్లలో మినుము పంట దెబ్బతిందని 2802 హెక్టార్లలో ఉద్యాన పం టలు దెబ్బతిన్నాయన్నారు. విద్యుత్‌ శాఖకు సంబంధించి 45 సబ్‌స్టేషన్లు, 470 విద్యుత్‌ స్తంభాలు 270 ఎల్‌టీ లైన్లు, పీడర్లు దెబ్బతిన్నాయన్నారు. ఎర్రకాలువ ప్రవాహం వల్ల తీవ్ర నష్టం జరిగిందని తెలిపారు. మొత్తం 21 ప్రాం తాల్లో కాల్వలు, రేవులు, రోడ్డు మార్గాలు దెబ్బతిన్నాయని తెలిపారు.గోపాలపురం మండలం చిట్యాల, వెంకటాయపాలెం గ్రామాల్లో 540 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని తెలిపారు. కొవ్వాడ కాల్వ కారణంగా గత 30 ఏళ్లుగా పం టను నష్టపోతున్నారని బృందం దృష్టికి తీసుకె ళ్లారు. సీఈఈఏ డిప్యూటీ డైరెక్టర్‌ ఆర్తీ సింగ్‌, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏడీ మనోజ్‌ కుమార్‌ మీనా, తదితర కేంద్ర బృంద సభ్యులు పర్యటించారు. వారి వెంట రాష్ట్ర అధికారి ఢిల్లీ రావు, జేసీ మేఘా స్వరూప్‌, ఆర్‌డీవో రా ణి సుశ్మిత,జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌.మా ధవరావు, సివిల్‌ సప్లయిస్‌ మేనేజర్‌ గణేశ్‌కు మార్‌,ఏవో ఏసుబాబు,ఎస్‌ఐమనోహర్‌ ఉన్నారు.

Updated Date - Nov 11 , 2025 | 12:53 AM