వేగం.. తీసింది ఇద్దరి ప్రాణం!
ABN , Publish Date - Dec 12 , 2025 | 12:23 AM
జగ్గంపేట, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): కాకినా డ జిల్లా జగ్గంపేట మం డలం రామవరం లోని బొప్పిడి సిరామిక్స్ ఫ్యా క్టరీ వద్ద గురువారం వే గంగా వచ్చి
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న కారు
ప్రాణాలు వదిలిన పాస్టర్, మహిళ
మరో ఇద్దరికి గాయాలు
జగ్గంపేట మండలం రామవరంలో ఘటన
జగ్గంపేట, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): కాకినా డ జిల్లా జగ్గంపేట మం డలం రామవరం లోని బొప్పిడి సిరామిక్స్ ఫ్యా క్టరీ వద్ద గురువారం వే గంగా వచ్చిన కారు ద్విచ్ర వాహనాన్ని ఢీకొన్న ప్ర మాదంలో ఇద్దరు మర ణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. వివరాల ప్రకారం.. ఏలేశ్వరానికి చెందిన బొల్ల నూకరాజు (64) పా స్టర్‌గా ఉన్నారు. మనవడు దొండ పాటి శ్రీనును తీసుకుని ఏపీ40 ఈవీ1651 నంబరు గల టీవీఎస్ ఎక్స్‌ఎల్ ద్విచక్రవాహనంపై ఫైనాన్స్ డబ్బులు చెల్లించ డానికి జగ్గంపేటకు బయ లుదేరారు. వారు రామ వ రంలోని బొప్పిడి సిరామిక్స్ వద్దకు వచ్చేసరికి ఎర్రవరం నుంచి జగ్గంపేట వైపు వెళ్తున్న ఏపీ 31సీజే 555 నంబరు గల వెర్నా కారు ఢీకొంది. ఈ ఘటనలో నూకరాజు అక్కడికక్కడే మరణించగా శ్రీనుతో పాటు కారులో ఉన్న మహిళకు, ఆమె కుమారుడికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మహిళ చికిత్స పొందుతూ మరణించింది. ఘటన పై జగ్గంపేట ఎస్‌ఐ రఘు నందన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తట్టుకోలేకపోయిన తల్లి...
ప్రమాదంలో మరణించిన మహిళ తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండల వాసి. విషయం తెలిసి ఆమె మహిళ తల్లి వేదన చెందిం ది. కూతూరు, మనవడికి ఇలా అయ్యిందని తెలిసి ఆసుపత్రికి వెళ్లింది. బాధతో ఆసుపత్రి పై నుంచి దూకింది. దీంతో ఆమెకు గాయాలయ్యాయి.