పిఠాపురంలో కారు బీభత్సం
ABN , Publish Date - May 23 , 2025 | 12:31 AM
పిఠాపురం, మే 22 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా పిఠాపురం బైపాస్‌లో 216వ హైవేపై పాదగయ సెంటర్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. మోటార్‌సైకిళ్లపైకి దూసుకెళ్లడంతో ధ్వంసమై ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. బుధవారం అర్ధ రాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ సంఘటన వాహనదారులను భీతావాహు
అతివేగంగా వచ్చి మోటార్‌సైకిళ్లను ఢీకొనడంతో ధ్వంసం
జాతీయ క్రీడాకారుడు సహా ముగ్గురికి తీవ్ర గాయాలు
పిఠాపురం, మే 22 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా పిఠాపురం బైపాస్‌లో 216వ హైవేపై పాదగయ సెంటర్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. మోటార్‌సైకిళ్లపైకి దూసుకెళ్లడంతో ధ్వంసమై ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. బుధవారం అర్ధ రాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ సంఘటన వాహనదారులను భీతావాహులను చేసింది. పిఠాపురం ఇందిరానగర్‌కు చెందిన పోల్‌వాల్ట్ జాతీయ క్రీడాకారుడు పి.కృష్ణ, ఏడిద వెంకటేష్‌లు చిత్రాడ లో జరిగిన బి.ప్రత్తిపాడుకు చెందిన కె.మహేంద్ర పెళ్లికి వెళ్లి సామర్లకోట రోడ్డు నుంచి మోటార్‌సైకిళ్లపై తిరిగి వస్తున్నా రు. విశాఖపట్టణం నుంచి కాకినాడ వ స్తున్న కారు అతివేగంగా రావడంతో పాటు అదు పుతప్పి వారిని ఢీకొని పాదగయ వద్ద పార్కి ంగ్‌లో ఉన్న మోటార్‌సైకిళ్లపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ప్రభుత్వ,ప్రవేటు ఆసుపత్రులకు తరలించారు. మహేంద్ర పరిస్థితి విషమంగా ఉంది. పా ర్కింగ్‌లో ఉన్న 5 మోటారు సైకిళ్లు దెబ్బతిన్నాయి. పిఠాపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.