కేబినెట్ ‘వరాలు’
ABN , Publish Date - Aug 22 , 2025 | 01:15 AM
జగ్గంపేట నియోజకవర్గంలో కీలకమైన తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం తీపికబురు అందించింది. గత వైసీపీ హయాంలో పైపులైన్లు మరమ్మతుకు గురై మూ లనపడ్డ ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు ఊపిరి పోశారు.
పుష్కర ఎత్తిపోతల పథకం పైపులైన్ల మార్పునకు ఆమోదముద్ర
రూ.51.67 కోట్లతో పరిపాలన ఆమోదం ఇచ్చే ప్రతిపాదనకు పచ్చజెండా
31వేల ఎకరాల ఆయకట్టుకు ఊపిరిలూదిన సీఎం చంద్రబాబు
గ్రామ, వార్డు సచివాలయాల్లో పోస్టుల భర్తీకి ఆమోదంతో ఊరట
చింతూరు ఆసుపత్రి 50 నుంచి వంద పడకలుగా మార్పునకు ఓకే
(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
జగ్గంపేట నియోజకవర్గంలో కీలకమైన తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం తీపికబురు అందించింది. గత వైసీపీ హయాంలో పైపులైన్లు మరమ్మతుకు గురై మూ లనపడ్డ ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు ఊపిరి పోశారు. పాడైపోయిన కీలక పైపులైన్ల స్థానంలో కొత్తవి నిర్మించడానికి మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. రూ.51.67 కోట్లతో పనులు చేపట్టేందుకు వీలుగా పరిపాలన ఆమోదం ఇచ్చే ప్రతిపాదనకు పచ్చజెండా ఊపింది. దీంతో 31వేల ఎకరాల ఆయకట్టుకు తిరిగి నీరు అందబోతోంది. గండేపల్లి మండలం తాళ్లూరు వద్ద నిర్మించిన ఈ పథకం ఎన్నో ఏళ్లుగా మరమ్మతులకు గురైంది. దీనికి శంకుస్థాపన నుంచి టెండర్లు పిలిచి పనుల ప్రారంభం వరకు అప్పట్లో టీడీపీ ప్రభుత్వంలోనే జరిగింది. తీరా వైఎస్ సీఎం అయిన తర్వాత ప్రా జెక్టు పనుల్లో మార్పులు చేశారు. సాగునీరు ప్రవ హించడానికి ఇనుప పైపులు బదులు సిమెంట్ పైపులు వినియోగించారు. దీంతో కాలక్రమేణా సిమెంట్ పైపులపై ఒత్తిడి పెరిగి ఎందుకు పనికి రాకుండా పోయాయి. గత వైసీపీ హయాంలో వీటికి మరమ్మతులు చేయాల్సి ఉన్నా పట్టించుకో లేదు. దీంతో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దాదాపు 14సార్లు సీఎం చంద్రబాబు దృష్టికి విష యాన్ని తీసుకువెళ్లారు. చంద్రబాబు మానసపుత్రి కలాంటి ఎత్తిపోతల పథకానికి నిధులు విడుదల చేయాలని కోరారు. దీంతో ప్రయత్నాలు ఫలించి పీఎస్‌సీ ప్రెజర్ మెయినను ఎంఎస్ ప్రెజర్ మె యినతో మార్చే పనికి టెండర్లను ఆహ్వానించి రూ. 51.67 కోట్లతో పరిపాలన ఆమోదం ఇచ్చే ప్రతిపా దనను మంత్రిమండలి ఆమోదించింది. దీనిపై ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్పందిస్తూ సీఎం చంద్రబాబు రుణం తీర్చుకోలేనిదని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో పైపులైన్ల మరమ్మతులకు నిధు లు అడిగితే రూ.25 లక్షలు విదిల్చారని, కానీ ఇప్పు డు సీఎం చంద్రబాబు రూ.51.67కోట్లు విడుదలకు నిర్ణయించడం గొప్ప విషయమన్నారు. ఇక గ్రామ, వార్డు సచివాలయాల్లో డిప్యుటేషన, అవుట్ సోర్సిం గ్ విధానం కింద 2,778 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆ మోదం తెలిపింది. దీంతో ఉమ్మడి జిల్లాలో ఖాళీగా ఉన్న 1,500 పోస్టుల్లో 700వరకు పోస్టులను భర్తీ చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. అలాగే చింతూరులో ఉన్న 50పడకల ఆసుపత్రిని వంద పడకలస్థాయికి పెంచుతూ ఆమోదించింది.