బై..బై..గణేశా!
ABN , Publish Date - Sep 07 , 2025 | 01:11 AM
తొమ్మిది రోజులపాటు భక్తుల పూజలందుకున్న చవితి ఉత్సవాలు ముగియడంతో వినాయకుడు గంగమ్మ ఒడికి చేరాడు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాల్లో స్వామి వారిని డీజేలు, బాణసంచా కాల్పులు, సాంస్కృతిక కార్యక్రమాల ఊ రేగించారు. చిన్నాపెద్దా ఒకరికొకరు రంగులు పూసుకుని ఆనందోత్సాహాలతో వీడ్కోలు పలికా రు.
భక్తిశ్రద్ధలతో వినాయక నిమజ్జనాలు
ఆనందోత్సాహాలతో ఘన వీడ్కోలు
డీజేలు, బాణసంచాతో సంబరాలు
పలుచోట్ల అన్నసమారాధనలు
లడ్డూ ప్రసాదం వేలం
బిక్కవోలు, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): తొమ్మిది రోజులపాటు భక్తుల పూజలందుకున్న చవితి ఉత్సవాలు ముగియడంతో వినాయకుడు గంగమ్మ ఒడికి చేరాడు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాల్లో స్వామి వారిని డీజేలు, బాణసంచా కాల్పులు, సాంస్కృతిక కార్యక్రమాల ఊ రేగించారు. చిన్నాపెద్దా ఒకరికొకరు రంగులు పూసుకుని ఆనందోత్సాహాలతో వీడ్కోలు పలికా రు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీల ఆధ్వర్యం లో పలుచోట్ల అన్నసమారాధనలు జరిపారు. స్వామి వారి లడ్డూ ప్రసాదాలకు వేలం నిర్వహించారు. బిక్కవోలు మండలం ఇల్లపల్లి, రంగాపురం గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను జోడినాదాల తూము వద్ద బిక్కవోలు కెనాల్‌లో నిమజ్జనం చేశారు. బిక్కవోలులో ఏర్పా టు చేసిన 20 భారీ వినాయక విగ్రహాలను సా మర్లకోట కెనాల్‌లో క్రేన్‌ల సాయంతో నిమజ్జనం చేశారు. చిన్నారులు తాము ఏర్పాటు చేసుకున్న చిన్న మట్టి గణపతుల్ని కూడా ఆనందోత్సాహాల నడుమ నిమజ్జనం చేశారు. ఆరికరేవుల, కొంకుదురు, మెళ్లూరు, పందలపాక, కొమరిపాలెం, తొస్సిపూడి గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను తుల్యభాగలో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ వి.రవిచంద్రకుమార్ ఆధ్వర్యంలో ట్రైనీ ఎస్‌ఐ ఎ.రవీంద్రబాబు సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. కాగా బిక్కవోలు లక్ష్మీగణపతి ఆలయంలో నిర్వహిస్తున్న చవి తి ఉత్సవాలు మహాన్నదానంతో ముగిసాయి. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మహాలక్ష్మి దంపతులు సహకారంతో ఏర్పా టు చేశామని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు చాగంటి సాయిబాబారెడ్డి తెలిపారు.చవితి ఉత్సవాల ము గింపు సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు స్వా మిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ బేరా వేణమ్మ, కమిటీ సభ్యు లు పల్లి వాసు, పాలచర్ల శివప్రసాద్‌చౌదరి, పల్లి రాజారెడ్డి, ఆలయ ఈవో ఆకెళ్ల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.