Share News

బస్‌..ఫుల్‌!

ABN , Publish Date - Aug 18 , 2025 | 12:49 AM

బస్టాండ్‌లు కిటకిటలాడుతున్నాయి.. మహిళలతో నిండిపోతున్నాయి. బస్సులనీ మహిళలకే రిజర్వు చేసినట్టు అయిపోతున్నా యి.

బస్‌..ఫుల్‌!
కిటకిటలాడుతున్న రాజమండ్రి బస్టాండ్‌

మహిళా ప్రయాణికుల క్యూ

అన్ని దారులదీ ఇదే పరిస్థితి

50 వేల మంది ప్రయాణం

పెరుగుతున్న ఆక్యుపెన్సీ

వాడపల్లి స్పెషల్‌ బస్‌లకు ఫ్రీ

ప్రభుత్వం నుంచి ఆదేశాలు

రాజమహేంద్రవరం, ఆగస్టు 17 (ఆంధ్ర జ్యోతి) : బస్టాండ్‌లు కిటకిటలాడుతున్నాయి.. మహిళలతో నిండిపోతున్నాయి. బస్సులనీ మహిళలకే రిజర్వు చేసినట్టు అయిపోతున్నా యి.. ఎక్కడా సీట్లు ఖాళీ ఉండడంలేదు. స్ర్తీ శక్తి పథకం కింద ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ అవకాశం ఇచ్చింది. దీంతో మహిళల్లో ఉత్సాహం పెరి గింది. మూడో రోజుకే మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. ఆదివారం జిల్లాలో ఆర్టీసీకి మహిళలు పోటెత్తారు. బస్సులన్నీ కిట కిటలాడాయి.సాధారణంగా జిల్లాలో రోజుకు 32 వేల మంది మహిళలు ప్రయాణిస్తారనేది అంచనా. కానీ ఆదివారం సుమారు 50వేల మంది వరకూ మహిళలు ఉచిత ప్రయాణం చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఆగస్టు 15వ తేదీ సాయంత్రం నుంచి మహిళలకు స్ర్తీ శక్తి పథకం ప్రారంభించారు. మొదటి రోజు 2,345 మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారు. 16న 31,522 మంది ప్రయాణం చేశా రు. ఆదివారం అంచనాలకు మించి ప్రయాణి కులు పెరిగారు. సుమారు 50 వేల మంది మహిళలు ప్రయాణించినట్టు జిల్లా ఆర్టీసీ అధికారి ఏలూరి సత్యనారాయణమూర్తి తెలి పారు.ఎక్కువగా సీతానగరం, పురుషోత్తపట్నం, కోరుకొండ, గోకవరం, తుని, రాజోలు, అమ లాపురం, కొవ్వూరు, తాడేపల్లిగూడెం, తణుకు, ఏలూరు, జంగారెడ్డిగూడెం వైపు వెళ్లే బస్సు లన్నీ కిటకిటలాడాయి. ఆదివారం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో రద్దీ పెరిగింది. వరుసగా మూడు రోజులు సెలవు కావడంతో బంధువుల ఇంటికి, సొంత ఊళ్లకు, ఇతర పనుల మీద వెళ్లిన వారంతా తిరిగి రావడంతో రద్దీ పెరి గింది. పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లు కూడా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.

ఏజెన్సీ ప్రయాణికులకు మేలు..

జిల్లా నుంచి భద్రాచలం రోజూ 16 సర్వీ సులు నడుపుతున్నారు.పాడేరు నుంచి రాజ మండ్రి రెండు సర్వీసులు ఉన్నాయి. కానీ అం తరాష్ట్ర సర్వీసులకు ఉచిత ప్రయాణం లేక పోవడంతో ఏజెన్సీ ప్రజలకు ఇది నిరుప యో గంగా మారింది. అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ప్రభుత్వం సానుకూలంగా స్పం దించడం గమనార్హం.ఒకట్రెండు రోజుల్లో ప్రభు త్వం నుంచి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్టు ఆర్టీసీ జిల్లా అధికారి వైఎస్‌ఎన్‌ మూర్తి తెలిపారు.వాడపల్లి స్పెషల్‌ బస్సులకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ శనివారం రాత్రి ప్రభుత్వం ఆదేశాలిచ్చినట్టు చెప్పారు.

కలెక్టరేట్‌కు బస్‌ కావాలి

రాజమండ్రి హైవేలోని బొమ్మూరులో ఉన్న కలెక్టరేట్‌కు ప్రతీ సోమవారం పీజీఆర్‌ఎస్‌ కోసం జిల్లా నలుమూలల నుంచి అనేక మం ది ప్రజలు వస్తారు.కానీ వారికి బస్సు సౌక ర్యం లేదు. మొదట్లో బస్సులు ఒకట్రెండు నడిపినా సమయపాలన సరిగ్గా లేకపోవ డంతో సమస్య అయింది. వేమగిరి వైపు నుంచి కలెక్టరేట్‌ మీదుగా హైవేలో కొన్ని బస్సులు నడిపితే కడియం, అనపర్తి ప్రాం తాల నుంచి వచ్చేవారికి ప్రయోజనంగా ఉం టుందని ప్రజలు చెబు తున్నారు. నిడద వోలు నియోజకవర్గం వైపు వచ్చే బస్సులు కొన్నయినా బ్యారేజీ నుంచి ధవళేశ్వరం, కలె క్టరేట్‌ మీదగా నడపితే ఆ ప్రాంత ప్రజలకు సౌకర్యంగా ఉంటుందనే వాదన ఉంది.

Updated Date - Aug 18 , 2025 | 12:49 AM