సత్యదేవుడికి బస్సు విరాళం
ABN , Publish Date - Oct 11 , 2025 | 01:39 AM
అన్నవరం, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో శుక్రవారం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ శ్రీనివాసులు శెట్టి కుటుంబస
ప్రత్యేక పూజల అనంతరం అందించిన ఎస్‌బీఐ చైర్మన్
అన్నవరం, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో శుక్రవారం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ శ్రీనివాసులు శెట్టి కుటుంబసభ్యులతో స్వామిని దర్శించి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ ఈవో సుబ్బారావు, చైర్మన్ రోహిత్ ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. దర్శనానంతరం వేదపండితులు వేదాశీర్వచనాలు అందజేయగా ఈవో స్వామివారి ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థానానికి విచ్చేసే భక్తులకు రవాణా సౌకర్యం కోసం 32 సీట్లు సామర్థ్యం కలిగిన సుమారు రూ.25 లక్షల విలువైన బస్సును విరాళంగా అందజేశారు. ఈ బస్సు తాళాలను ఎస్‌బీఐ చైర్మన్ దేవస్థానం ఈవో, చైర్మన్‌కు అందజేశారు. ఎస్‌బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ రాజేష్‌కుమార్ పటేల్, హేమంత్‌కుమార్, పంకజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.