శంషాబాద్‌కు వెళ్లే బస్సు సర్వీసుల సమయాల్లో మార్పులు
ABN , Publish Date - Sep 19 , 2025 | 01:51 AM
ఏపీఎస్ ఆర్టీసీ డిపో నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లే బస్సు సర్వీసుల వేళల్లో స్వల్ప మార్పులు చేసినట్టు జిల్లా ప్రజారవాణాధికారి ఎస్టీపీ రాఘవకుమార్ తెలిపారు.
అమలాపురం, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): ఏపీఎస్ ఆర్టీసీ డిపో నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లే బస్సు సర్వీసుల వేళల్లో స్వల్ప మార్పులు చేసినట్టు జిల్లా ప్రజారవాణాధికారి ఎస్టీపీ రాఘవకుమార్ తెలిపారు. బుధవారం నుంచి ఈ వేళలు అమలులోకి వచ్చినట్టు తెలిపారు. ఉదయం 5.30 గంటలకు బయలుదేరాల్సిన సర్వీసు నంబరు 2456 5 గంటలకు బయలుదేరుతుందని, 7.30 గంటలకు బయలుదేరాల్సిన సర్వీసు నంబరు 23545 7 గంటలకు, మధ్యాహ్నం 12.30గంటలకు బయలుదేరాల్సిన సర్వీసు నంబరు 12 గంటలకు మార్పులు చేసినట్టు తెలిపారు. ఈ మార్పులను ప్రయాణికులు గమనించాలని రాఘవకుమార్ కోరారు.