మరణం ముంగిట మహోపకారం!
ABN , Publish Date - Nov 11 , 2025 | 01:09 AM
ఆలమూరు, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): కాలేజీ బస్సు డ్రైవర్‌కు ఆకస్మికంగా గుండెపోటు వచ్చింది. అయితే ఆ క్షణం తన కోసం కాకుండా విద్యార్థులను రక్షించాలనే ఆలోచనతో బస్సును పక్కకు ఆపి మరుక్షణం స్టీరింగ్‌పై వాలి డ్రైవర్ ప్రాణాలు వదిలాడు. ఈ సంఘటన
కాలేజీ బస్సు డ్రైవర్‌కు గుండెపోటు
బస్సును పక్కకు ఆపి క్షణాల్లో మృతి
50మంది విద్యార్థులు సురక్షితం
ఆలమూరు, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): కాలేజీ బస్సు డ్రైవర్‌కు ఆకస్మికంగా గుండెపోటు వచ్చింది. అయితే ఆ క్షణం తన కోసం కాకుండా విద్యార్థులను రక్షించాలనే ఆలోచనతో బస్సును పక్కకు ఆపి మరుక్షణం స్టీరింగ్‌పై వాలి డ్రైవర్ ప్రాణాలు వదిలాడు. ఈ సంఘటన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి వద్ద జాతీయ రహదారిపై సోమవా రం జరిగింది. వివరాల్లోకి వెళ్లితే.. తూర్పు గోదా వరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన ప్రైవే ట్ ఇంజనీరింగ్ కాలేజీ బస్సు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గంటి నుంచి బయలుదేరింది. రాజమహేంద్రవ రానికి 50మంది విద్యార్థులను ఆలమూరు మం డలం మడికి గ్రామానికి చెందిన దెందుకూరి నారాయణరాజు (60) అనే డ్రైవర్ తీసుకువెళుతున్నారు. మడికి దాడిన వెంటనే డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో తక్షణం బస్సును పక్కకు ఆపి స్టీరింగ్‌పై పడిపోయాడు. దీం తో విద్యార్థులు ఒక్క సారిగా భయభ్రాంతులైబస్సు నుంచి దిగిపోయా రు. వెంటనే నారాయణరాజుకు సీఎంఆర్ చేసి అంబులెన్స్‌కు ఫోన్ చేయగా అప్పటికే ప్రాణాలు విడిచినట్టు స్థానికులు చెప్తున్నారు. తాను చనిపోతూ 50మంది విద్యార్థులకు చిన్నపాటి హాని జరగకుండా చేసిన డ్రైవర్ నారాయణరాజుకు విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
క్యారేజీ తీసుకున్న 5 నిమిషాలకే..
దాదాపు 40ఏళ్లుగా డ్రైవర్ వృత్తినే నమ్ముకుని జీవిస్తున్న నారాయణరాజుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. నారాయణరాజు ప్రతీ రోజు ఉద యమే క్యారేజీ పట్టుకుని డ్రైవింగ్‌కు వెళ్తాడు. సోమవారం ఉదయం అతడు బయలు దేరే సమయానికి వంట పూర్తి కాకపోవడంతో తాను రోడ్డుమీదకు తీసుకొచ్చి క్యారేజీ అందిస్తానని భార్య చెప్పడంతో నారాయణరాజు వెళ్లిపోయ్యాడు. గంటి బయలుదేరి వచ్చి మడికి వద్ద భార్య చేతులమీదుగా క్యారేజీ తీసుకున్న ఐదు నిమిషాల వ్యవధిలోనే గుండెపోటు వచ్చిన భర్త చనిపోవడంతో భార్య బేబి బోరున విలపిస్తుంది.