Share News

ఓస్‌..ఇంతేనా!

ABN , Publish Date - Jul 29 , 2025 | 12:02 AM

ప్రభుత్వం చెబితే చేయాలా? మన దందా మనదే.. ? ఉన్నతాధికారులేమైనా వస్తారా.. చూస్తారా..? మనం చెప్పిందే వేదం.. మనం రాసిందే నివేదిక ఇదీ కిందిస్థాయి పంచాయతీ అధికారుల తీరు.

ఓస్‌..ఇంతేనా!

జిల్లాలో 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలు 786 మాత్రమే

క్షేత్రస్థాయి పరిశీలనకు సూచన

ప్రత్యేక బృందాల ఏర్పాటు

తూతూ మంత్రంగా తనిఖీలు

ఇష్టానుసారం నివేదికలు

రాజానగరంలో 117

రాజమండ్రి రూరల్‌లో 30

విస్తుపోతున్న అధికారులు

రాజమహేంద్రవరం రూరల్‌, జూలై 28 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం చెబితే చేయాలా? మన దందా మనదే.. ? ఉన్నతాధికారులేమైనా వస్తారా.. చూస్తారా..? మనం చెప్పిందే వేదం.. మనం రాసిందే నివేదిక ఇదీ కిందిస్థాయి పంచాయతీ అధికారుల తీరు.. జిల్లాలో 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కట్టిన భవనాల లెక్క తీసి పన్ను మదింపు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో సదరు ఉద్యోగులు రంగంలోకి దిగారు.. తీరా వారిచ్చిన నివేదిక ప్రకారం తూర్పుగోదావరి జిల్లా మొత్తం కేవలం 786 భవనాలు మాత్రమే ఉన్నాయంట.. ఒకసారి ఉన్నతాధికారులు రంగంలోకి దిగితే అసలు లెక్క తేలుతుంది.. గ్రామ పంచాయతీల ఆదాయం పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. పంచాయతీల పరిధిలో 10 వేలు చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన అన్ని రకాల భవనాలకు సంబంధించి పన్నులు పరిశీ లించాలని పంచాయతీ రాజ్‌ గ్రామీణాభివృద్ధి కమిషనర్‌ వీడిమో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. నిబంధనల ప్రకారం కొలతలు వేసి పన్ను మదింపు చేశారా లేక అవకతవకలు జరిగాయా అన్నదానిపై క్షేత్ర స్థాయిలో భవనాలు పరిశీలించి మరలా పన్ను మదింపు చేయాలని సూచించారు. ఈ నేప ఽథ్యంలో జిల్లా పంచాయతీ అధికారి శాంతా మణి పక్క మండలాల డిప్యూటీ ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులను బృందాలుగా ఏర్పా టు చేశారు.క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లి భవనం స్ధితిగతులు, ప్లాన్‌ ప్రకారం నిర్మా ణాలు చేపట్టారా.. వాటికి అనుగణంగా పన్ను మదింపు చేశారా అన్న విషయాలను లోతుగా పరిశీలించి ఫొటోలు సంబంధిత యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలంటూ పేర్కొన్నారు. భవ నాల పన్ను మదింపులో తేడాలు పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. అక్కడవరకు బాగానే ఉంది. అయితే జిల్లా పంచాయతీ అధికారి ఇచ్చిన ఉత్తర్వుల్లో జిల్లా లో 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న నిర్మాణాలు మెత్తం 786 భవనాలు మాత్రమే పేర్కొనడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనపర్తి మండలంలో 92 అసెస్‌మెంట్లు, బిక్కవోలు మండలంలో 24, చా గల్లు మండలంలో 94, దేవరపల్లి మండలంలో 94, గోకవరం మండలంలో 13, గోపాలపురం మండలంలో 29, కడియం మండలంలో 52, కోరుకొండ మండలంలో 18, కొవ్యూరు మండ లంలో 14, నల్లజర్ల మండలంలో 40, నిడద వోలు మండలంలో 19, పెరవలి మండలంలో 24, రాజమహేంద్రవరం రూరల్‌ మండలంలో 30, రాజానగరం మండలంలో 117, రంగంపేట మండలంలో 31, సీతానగరం మండలంలో 9, తాళ్ళపూడి మండలంలో 25, ఉండ్రాజవరం మండలంలో 20 ఉన్నాయి.ఈ లెక్క ఎలా తేల్చారన్నది ప్రస్తుతం ప్రశ్నగా ఉంది. దీనిపై డీపీవో శాంతామణిని ప్రశ్నించగా జిల్లా వ్యాప్తం గా 10 వేలు చదరపు అడు గుల విస్తీర్ణంలో నిర్మించిన భవనాల జాబితా పంచాయతీ రాజ్‌ కమిషనరేట్‌ కార్యాలయం నుంచి వచ్చిందని చెప్పడం గమనార్హం.

Updated Date - Jul 29 , 2025 | 12:02 AM