Share News

పెద్దేవంలో గేదెలకు బి.కోలి, పొట్ట జలగ వ్యాధి

ABN , Publish Date - Sep 17 , 2025 | 12:39 AM

తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామంలో వరసగా పాడె గేదెలు మృతి చెంద డానికి కారణాలు ధ్రువీకరణ అయినట్టు జిల్లా పశుసంవర్థక శాఖాధికారి డా.టి.శ్రీనివాసరావు తెలిపారు.

పెద్దేవంలో గేదెలకు బి.కోలి, పొట్ట జలగ వ్యాధి
పెద్దేవంలో పర్యటించి వివరాలు సేకరించిన పశు వైద్యాధికారులు

15 గేదేలలో వ్యాధి లక్షణాలు

పశు సంవర్థక అధికారుల చికిత్స

రాజమహేంద్రవరం, సెప్టెంబరు 16 (ఆం ధ్రజ్యోతి) : తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామంలో వరసగా పాడె గేదెలు మృతి చెంద డానికి కారణాలు ధ్రువీకరణ అయినట్టు జిల్లా పశుసంవర్థక శాఖాధికారి డా.టి.శ్రీనివాసరావు తెలిపారు.ఈ మేరకు మంగళవారం రాత్రి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకూ బి.కోలీ, పొట్ట జలగ వ్యాధు లతో 9 గేదెలు మృతిచెందాయన్నారు. వ్యాధి నిర్ధారణ కావడంతో చికిత్స కొనసా గిస్తున్నామ న్నారు.కొత్త కేసులు నమోదు కాలేదన్నారు. ఆగస్టు 24న మొదటిసారిగా పాడె గేదెల మెడ ఎడమవైపున తెల్లటి మచ్చలు రావడం తో రైతులు చికిత్స చేయించారన్నారు. మూడు నుంచి నాలుగు రోజులు చికిత్స చేసినా ఫలితం లేకపోవడంతో 9 గేదెలు మృతి చెందా యన్నారు. రైతుల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే వైద్య బృందం పెద్దేవం గ్రామం చేరుకుని పరీక్షలు నిర్వహించగా 15 గేదెలకు వ్యాధి లక్షణాలు ఉన్నట్టు గుర్తించారన్నారు. గేదెల రక్తం, పేడ, గడ్డి, దాణా, నీటి నమూ నాలను సేకరించి ల్యాబ్‌ పరీక్షలకు పంపా మన్నారు. పేడ పరీక్షలో బి.కోలి, పొట్టజలగ వ్యాధి నిర్ధారణ అయిందన్నారు. దానికి అను గుణంగా చికిత్స ప్రారంభించినట్టు పేర్కొన్నా రు. కాకినాడలోని ప్రాంతీయ పశు వ్యాధి నిర్ధారణ ల్యాబ్‌ అధికారులు ఈ నెల 3న పెద్దేవం వెళ్లి అక్కడ గేదెల పరిస్థితిని, ఆ ప్రాంతాన్ని సందర్శించి నీటి నమూనాలు తీసి పరీక్షించారన్నారు.అందులో రెండు చోట్ల తక్కువ మోతాదులో హానికర రసాయనాలు ఉన్నట్టు గుర్తించినట్టు చెప్పారు.ఈ నెల 13న విజయవాడ జీవశాస్త్ర పరిశోధన సంస్థ నిపు ణులు పరిశీలించి వైద్య సూచనలు చేశా రన్నా రు. గన్నవరంలోని శ్రీవేంకటేశ్వర వెట ర్నరీ విశ్వవిద్యాలయం విభాగాధిపతులు సోమవా రం గ్రామానికి వెళ్లి రైతులతో మాట్లాడి మరి న్ని నమూనాలు సేకరించారన్నారు. ఇప్పటికే బాధపడుతున్న గేదెలలో మూడింటి పరిస్థితి కొద్దిగా మెరుగుపడిందన్నారు. రైతులు ఆందో ళన చెందొద్దని..సిబ్బంది అందుబాటులో ఉన్నా రని,ఎమర్జన్సీ పరిస్థితి ఉన్నా కంట్రోలు రూమ్‌ నంబర్‌ 9951505099లో సంప్రదించాలన్నారు.

Updated Date - Sep 17 , 2025 | 12:39 AM