పెద్దాపురంలో వ్యభిచారగృహ నిర్వాహకురాలికి సహకారం
ABN , Publish Date - Jul 24 , 2025 | 12:54 AM
కాకినాడ క్రైం, జూలై 23 (ఆంధ్రజ్యోతి): పెద్దాపురంలో వ్యభిచారగృహ నిర్వాహకురాలికి సహకరించారనే అభియోగం విచారణలో నిగ్గు తేలడంతో కానిస్టేబుల్, హోంగార్డ్‌పై సస్పెన్షన్ వేటు వేస్తూ కాకినాడ జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దాపురంలో వ్యభిచారగృహంలో విటులు
కానిస్టేబుల్, హోంగార్డ్ సస్పెన్షన్
ఎస్‌ఐ, పోలీస్ అధికారులపై క్రమశిక్షణా చర్యలకు కాకినాడ జిల్లా ఎస్పీ సిఫార్సు
కాకినాడ క్రైం, జూలై 23 (ఆంధ్రజ్యోతి): పెద్దాపురంలో వ్యభిచారగృహ నిర్వాహకురాలికి సహకరించారనే అభియోగం విచారణలో నిగ్గు తేలడంతో కానిస్టేబుల్, హోంగార్డ్‌పై సస్పెన్షన్ వేటు వేస్తూ కాకినాడ జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దాపురంలో వ్యభిచారగృహంలో విటులు దొరికినా పట్టుకోకుండా నిర్వాహకురాలు భారతికి స్థానిక పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ జి.శివరామకృష్ణ, హోంగార్డ్ సీహెచ్.శివకృష్ణ సహకరిస్తున్నారని అందిన ఫిర్యాదు మేరకు శాఖాపరంగా వి చారణ చేపట్టిన దర్యాప్తు అధికారులు సమర్పించిన నివేదిక ఆధారంగా కానిస్టేబుల్, హోంగార్డ్‌ను ఎస్పీ సస్పెండ్ చేశారు. అలాగే పెద్దాపురం ఎస్‌ఐ వి.మౌనికపై క్రమశిక్షణా చర్యలు, అలాగే మరికొంతమంది పెద్దాపురం సబ్ డివిజన్‌లోని పోలీస్ అధికారులపై క్రమశిక్షణా చర్యలకు ఉన్న తాధికారులకు ఎస్పీ సిఫార్సు చేశారు. పెద్దాపు రం పరిసర ప్రాంతాల్లో వ్యభిచారం జరగకుండా నిరంతర దాడులు చేయడం జరగుతుందని ఎ స్పీ విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు.
వ్యభిచార గృహాలపై దాడి
పెద్దాపురం, జూలై 23 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో వ్యభిచార గృహాలపై పోలీసులు బుధవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. పెద్దాపురం, ప్రత్తిపా డు, జగ్గంపేటకు చెందిన పోలీసులు అధికారుల బృందం స్థానిక మసీదు సెంటర్, వక్కలంకవారి వీధిలో ఈ దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో సందిగిరి దుర్గ, ప్రత్తిపాటి జీవన్‌ను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు. వ్యభిచార గృహా లు నిర్వహించే వారిపై చట్టపరంగా కఠిన చర్య లు తప్పవని ఆయన హెచ్చరించారు. దాడుల్లో సీఐ విజయశంకర్, ఎస్‌ఐ మౌనిక పాల్గొన్నారు.