తాండవ నదిలో బాలుడు గల్లంతు
ABN , Publish Date - Oct 23 , 2025 | 12:43 AM
తుని రూరల్, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా తునిలో తాండవ నదిలో 11 ఏళ్ల బాలుడు గల్లంతయ్యాడు. వివ రాల ప్రకారం.. తుని పట్టణంలోని రాజీవ్ గృహకల్పకాలనీకి చెందిన మాకిరెడ్డి స్వరాజ్ (11), బావిశెట్టి గణేష్ (14) బుధవారం ఉదయం తుని శివారు కాట్రావుల
తుని రూరల్, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా తునిలో తాండవ నదిలో 11 ఏళ్ల బాలుడు గల్లంతయ్యాడు. వివ రాల ప్రకారం.. తుని పట్టణంలోని రాజీవ్ గృహకల్పకాలనీకి చెందిన మాకిరెడ్డి స్వరాజ్ (11), బావిశెట్టి గణేష్ (14) బుధవారం ఉదయం తుని శివారు కాట్రావుల వద్ద తాం డవ నదిలో స్నానానికి దిగారు. ఇద్దరు బాలు రు గల్లంతవుతుండగా ఇది గమనించి స్థానికు లు ఒకరిని కాపాడారు. మాకిరెడ్డి స్వరాజ్ (11) అనే బాలుడు గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలిం చారు. గత ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. కానీ స్వరాజ్ ఆచూకీ ల భించకపోవడంతో అతడి కుటుంబ సభ్యు లు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.