పాండవుల మెట్టకు 1800 ఏళ్లు
ABN , Publish Date - Nov 09 , 2025 | 12:49 AM
బుద్ధిజం ద్వారానే సమాజ వికాసం జరుగుతుందని బుద్దిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు, అంబేడ్కర్ ముని మనవడు రాజా రత్న అశోక్ అంబేడ్కర్ పేర్కొన్నారు.
బుద్ధిజం ద్వారానే సమాజ వికాసం
కోరుకొండ, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): బుద్ధిజం ద్వారానే సమాజ వికాసం జరుగుతుందని బుద్దిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు, అంబేడ్కర్ ముని మనవడు రాజా రత్న అశోక్ అంబేడ్కర్ పేర్కొన్నారు.కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో పాండువుల మెట్ట వద్ద శనివారం నిర్వహించిన భారతీయ బౌద్ధ వారసత్వ సాంస్కృతిక ఉత్సవంలో ఆయన మాట్లా డారు. వేదాలు, మనుస్మృతిలో ఎక్కడా కుల ప్రస్తావన లేదని దళితులను ఒక్కో రాష్ట్రంలో ఒక్కోపేరుతో పిలుస్తున్నారన్నారు. పాండవు ల మెట్ట రెండో శతాబ్దానికి చెందిన ఒక ప్రాచీన బౌద్ధ వారసత్వ స్థలం.. ఈ కొండపై బౌద్ధ సన్యాసులు నివసించిన గదులు, చైత్యం,స్తూపాలు, పూజ గది, డ్రెయినేజీ వ్య వస్థ, పెద్ద హాలు తవ్వకాల్లో బయట పడ్డా యన్నారు. ఈ స్థలం దాదాపు 1800 సంవత్సరాల పురాతన చరిత్ర కలిగి ఉందని తెలిపారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ కార్తీకమాసం లో పిల్లలు, పెద్దలు పాండవుల మెట్టకు వచ్చి చారిత్రక, ఆధ్యాత్మిక అనుభూతిని పొం దుతారన్నారు. బౌద్ధ మత వ్యాప్తి, ఆధ్యా త్మికత, పురాతన భారతీయ నిర్మాణ కళకు ప్రతీకగా నిలిచేలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. అంతర్జాతీయ పర్యాట కు లను ఆకర్షించే విధంగా తయారు చేస్తామ న్నారు. ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి సహ కారంతో టిబెటన్ ఆర్ట్స్ అండ్ కల్చర్ పథకం కింద అభివృద్ధి చేస్తామన్నారు. బౌద్ధ క్షేత్రం అభివృద్ధికి రూ.21 కోట్లతో డీపీఆర్ రూపొం దించినట్టు తెలిపారు. సమావేశంలో బుద్దిస్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు చిలకపాటి సుబ్బారావు, జనచైతన్య మండలి నాయకుడు నేలపాటి పెద్దిరాజు, ఏఎంసీ చైర్మన్ తనకాల నాగేశ్వరరావు, కాపవర ం సర్పంచ్ జాజుల రాము, టీడీపీ నాయకులు తెలగంశెట్టి శ్రీనివాసు, కోరుకొండ సర్పంచ్ కర్రి లక్ష్మి సరోజ వీరగణేష్ పాల్గొన్నారు.