Share News

రైతులను ఆదుకోని ప్రభుత్వం

ABN , Publish Date - Sep 04 , 2025 | 12:56 AM

కాకినాడ, సెప్టెంబరు 3, (ఆంధ్రజ్యోతి): రైౖతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూ ర్తిగా విఫలమైందని, వారికి యూరియా కూడా సరిగా అందజేయలేకపోతోందని, రైతులు బ్లాక్‌ మార్కెట్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి నెలకొందని వైసీపీ ఉభయగోదావరి జిల్లాల రీజినల్‌ కోఆర్డినేటర్‌, శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ అన్నారు. బుధవారం సాయం త్రం ఆయన కాకినాడలోని వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించా

రైతులను ఆదుకోని ప్రభుత్వం
కాకినాడలో మాట్లాడుతున్న బొత్స

వారికి మద్దతుగా వైసీపీ ఉద్యమం : శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స

కాకినాడ, సెప్టెంబరు 3, (ఆంధ్రజ్యోతి): రైౖతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూ ర్తిగా విఫలమైందని, వారికి యూరియా కూడా సరిగా అందజేయలేకపోతోందని, రైతులు బ్లాక్‌ మార్కెట్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి నెలకొందని వైసీపీ ఉభయగోదావరి జిల్లాల రీజినల్‌ కోఆర్డినేటర్‌, శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ అన్నారు. బుధవారం సాయం త్రం ఆయన కాకినాడలోని వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా ఇబ్బంది పడేది రైతేనని, కూటమి ప్రభుత్వంలో అన్నదాతల పరిస్థితి చాలా దారుణంగా తయారైందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి, మంత్రుల మాటలు కోటలు దాటుతున్నాయి తప్పా, చేతల్లో ఎక్కడా కనిపించడంలేదన్నారు. చంద్రబాబు అధికారంలో ఉంటే అయితే అనావృష్టి, లేకుంటే అతివృష్టి అని ధ్వజమెతారు. రాష్ట్రంలో రైతులు యూరియా కోసం అగచాట్లు పడుతున్నారన్నారు. వారికి మద్దతుగా ఈనెల 9న రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్డీవో కార్యాలయాల వద్ద రైతులతో కలిసి నిరసన తెలిపి, ఆర్డీవోలకు వినతిపత్రాలు అందజేస్తామన్నారు. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అని, ఎంతోమంది ప్రాణత్యాగాల ప్రతిఫలమని, దీని కోసం పెద్ద ఎత్తున వైసీపీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామన్నారు. శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి జిల్లా వరకు అన్ని నియోజకవర్గాల ప్రజామద్దతు నిరసన ఉద్యమం చేపట్టేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు. గత నెల 30న కూటమిలో ఉన్న ముఖ్యమంత్రి, మంత్రులు విశాఖలో ఉన్నా కనీసం విశాఖ ఉక్కుపై నోరెత్తలేదన్నారు. ఎన్నికల ముందు 21 మంది ఎంపీలు ఉన్నారు.. మీరు ఉప్పుకారం తింటున్నారా లేదా? అంటూ తెగ ఊగిపోతూ వైసీపీని విమర్శించిన పవన్‌కల్యాణ్‌ నేడు అధికారంలో ఉండి ఏం చేస్తున్నారని బొత్స ప్రశ్నించారు. నాటి పౌరుషం ఏమైందని, ఉప్పు కారం మీరు తినడం మానేశారా? అంటూ పవన్‌పై ధ్వజమెత్తారు. దీనిపై మీ కార్యాచరణ ఏమిటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. 18 సార్లు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు విశాఖ ఉక్కుపై అక్కడి పెద్దలపై ఏం మాట్లాడారో వెల్లడించాలని బొత్స పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.రెండు లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చిందని, అది నిజమో! కాదో! చెప్పాలని డిమా ండ్‌ చేశారు. సుగాలి ప్రీతి హత్య కేసుపై తమ ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసి, సీబీఐకి అప్పగించిందన్నారు. ఇలాంటి విషయంలో మాట్లాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, సీఎం చంద్రబాబు అన్నట్టుగానే అసెంబ్లీలో తేల్చుకుంటామని ఆయన వెల్లడించారు. అధికార పక్షం నుంచి కూటమి, ప్రతిపక్షంగా వైసీపీ రెండు తేల్చుకుందాం రండి అని పిలుపునిచ్చారు.

Updated Date - Sep 04 , 2025 | 12:56 AM