Share News

తెలుగు..వెలుగేది!

ABN , Publish Date - Aug 09 , 2025 | 12:32 AM

రాజమహేంద్రవరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటుకు రాష్ట్ర కేబి నెట్‌ ఆమోదం తెలిపి, నోటిఫికేషన్‌ కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే.

తెలుగు..వెలుగేది!
బొమ్మూరు తెలుగు వర్శిటీ

నోటిఫికేషన్‌ ఇచ్చి రెండు నెలలు

ఏర్పాటు కాని ప్రధాన కార్యాలయం

వైస్‌ చాన్సలర్‌ ఊసు లేదు

ఈ ఏడాది తరగతుల సంగతేంటో

ప్రభుత్వ నిర్ణయంతో ప్రాణం

ఇంకనూ ఊపిరిపోసుకోని వైనం

శిథిలావస్థకు చేరిన భవనాలు

భాషాభిమానుల ఎదురుచూపులు

(రాజమహేంద్రవరం -ఆంధ్రజ్యోతి)

రాజమహేంద్రవరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటుకు రాష్ట్ర కేబి నెట్‌ ఆమోదం తెలిపి, నోటిఫికేషన్‌ కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. రెండు నెలలు దాటి నా ఇంకా బొమ్మూరు తెలుగు వర్శిటీ ఆవ రణలో ఎలాంటి కదలిక లేదు.2024- 25 విద్యా సంవత్సరం నుంచి ఇక్కడ అడ్మిష్లను ఆగిపో యాయి. ఫైనల్‌ విద్యార్థుల పరీక్షలు ఇటీవల పూర్తయ్యాయి. సాధారణంగా జూన్‌లో నోటిఫి కేషన్‌ ఇచ్చి ఆగస్టులో తరగతులు ఆరంభిస్తారు. కానీ ఇంకా వీసీ,రిజిస్ర్టార్‌, ఫ్యాకల్టీ నియా మకాలు ఏమీ లేకపోవడంతో ఈ ఏడాది అడ్మి షన్లపై సందేశం కలుగుతోంది.

రాష్ట్ర విభజన తర్వాత..

2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత ఏపీలో తెలుగు పీఠం ఉనికి కోల్పో యింది. బొమ్మూరు తెలుగు పీఠంలో గతేడాది నుంచి అడ్మిషన్లు ఆగిపోయాయి. ఈ ఏడాది జూలై 3న ఎంఎ తెలుగు చివరి బ్యాచ్‌ పరీక్షలు పూర్తి కావడంతో పీఠం ఉనికి ప్రశ్నార్థకమైంది. ఈ పరిస్థితిలో రాజమండ్రిలో తెలుగు వర్శిటీ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన తెలుగు కు వెలుగునిచ్చింది.1986 ఏప్రిల్‌లో టీడీపీ వ్యవ స్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ నందమూరి తారక రామారావు హైదరాబాద్‌లో ఉన్న తెలుగు వర్శిటీలో భాగంగా బొమ్మూరులో పొట్టి శ్రీరా ములు తెలుగు విశ్వవిద్యాలయ పీఠం ఏర్పాటు చేశారు. బొమ్మూరు కొండపై సుమారు 45 ఎకరాలు, సమీపంలోని మరో 10 ఎకరాల భూమిని పీఠానికి దఖలు పరిచారు.పీఠంలో 300మంది పీహెచ్‌డీలు చేయగా, 450 మంది ఎంఫిల్‌, 550 మంది తెలుగు ఎంఎ చేశారు.

ఇదీ ప్రస్తుత పరిస్థితి

ప్రస్తుతం పీఠంలో 14 మంది ఉద్యోగులు ఉన్నారు. భవనాలు శిఽథిలమయ్యాయి. కేవలం 20 ఎకరాల స్థలం మాత్రం మిగిలింది. కానీ 29 వేల పుస్తకాలతో గ్రంథాలయం మాత్రం నిత్యనూతంగా ఉండడం గమనార్హం. 2016 వరకూ ఇక్కడ అన్ని కోర్సులు జరిగాయి. 2024-25 నుంచి మొత్తం అడ్మిషన్లు ఆగిపో యాయి. ఉద్యోగులకు జీతాలు కూడా రాని పరిస్థితి ఉంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఓఎస్‌డీని నియమించి జీతాలు ఇస్తు న్నారు. తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటుతో తెలుగు నేల పొంగి పరవశించిపోతున్నట్టు ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత ప్రజలు, ప్రముఖులు కోరిన సంగతి తెలిసిందే.చివరికి ప్రజల కోరికను చంద్రబాబు నెరవేర్చారు.రెండు నెలల కిందట అమరావతిలో జరిగిన కేబినెట్‌ సమావేశంలో రాజమహేంద్ర వరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యా లయం ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు ఆమో దం తెలిపింది.ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ అయినట్టు ప్రకటించింది. ఏపీలో విశ్వవిద్యాల యం కార్యకలాపాలు ప్రారంభానికి వీలు కల్పిం చింది. ఏపీలో ఉన్న మూడు సాహిత్య పీఠాల నిర్వహణకు పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం పనిచేస్తుందని కేబినెట్‌ విశదీక రించింది.ఈ మేరకు ప్రభుత్వం తక్షణం వీసీని నియమించి తెలుగువిశ్వవిద్యాలయ పాలన ప్రారంభించాలని..ఈ ఏడాది నుంచి తరగతులు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Aug 09 , 2025 | 12:34 AM