Share News

ఘనంగా ప్రాచీన వారసత్వ బౌద్ధ సాంస్కృతిక ఉత్సవాలు

ABN , Publish Date - May 19 , 2025 | 12:45 AM

ఆదుర్రు బౌద్ధ స్థూపం వద్ద బుద్ధ పౌర్ణమి సందర్భంగా ప్రాచీన భారతీయ వారసత్వ బౌద్ధ సాంస్కృతిక ఉత్సవాలు ఘనంగా జరిగాయి.

ఘనంగా ప్రాచీన వారసత్వ బౌద్ధ సాంస్కృతిక ఉత్సవాలు

మామిడికుదురు, మే 18(ఆంధ్రజ్యోతి): ఆదుర్రు బౌద్ధ స్థూపం వద్ద బుద్ధ పౌర్ణమి సందర్భంగా ప్రాచీన భారతీయ వారసత్వ బౌద్ధ సాంస్కృతిక ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆదుర్రు బుద్ధవిహార్‌ ట్రస్టు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆదివారం బౌద్ధ స్థూపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. బౌద్ధ భిక్షువులు సంఘపాల, విజయానంద, బంతే అబయబోధి, సత్యబోధిలు పాల్గొని దమ్మ సందేశాన్ని ఇచ్చారు. బౌద్ధ స్థూపం వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పూజలు చేసి స్థూపం చుట్టూ తిరుగుతూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రతీ ఒక్కరూ బుద్ధుడు సూచించిన మార్గంలో పయనించాలని తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బౌద్ధ స్థూపం వద్ద అనేక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో బుద్ధవిహార్‌ ట్రస్టు ఫౌండర్‌ మెంబర్‌ ఎస్‌ఎస్‌ఆర్‌ భూపతి, అధ్యక్షుడు చింతా శ్రీరామమూర్తి, బౌద్ధ భిక్షవులు పాల్గొన్నారు.

Updated Date - May 19 , 2025 | 12:45 AM