కేరళ తరహాలో కోనసీమ అభివృద్ధి
ABN , Publish Date - Aug 26 , 2025 | 01:52 AM
కేరళ తరహాలో కోనసీమ ప్రాంతం అన్నివిధాలుగాను అభివృద్ధి సాధించేలా ఎన్డీఏ ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. సారఽథ్య యాత్రలో భాగంగా సోమవారం అమలాపురంలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఇందుకు ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రణాళికలు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్
అమలాపురంలో పార్టీ శ్రేణులతో సభ
ఎమ్మెల్సీ వీర్రాజుతో కలిసి సారథ్యయాత్ర
రైల్వేలైన్‌ను అభివృద్ధి చేస్తాం: చాయ్‌పే చర్చలో మాధవ్
అమలాపురం, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): కేరళ తరహాలో కోనసీమ ప్రాంతం అన్నివిధాలుగాను అభివృద్ధి సాధించేలా ఎన్డీఏ ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. సారఽథ్య యాత్రలో భాగంగా సోమవారం అమలాపురంలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొబ్బరి, తాటిచెట్లు ఎక్కే కార్మికుల కోసం ప్రధానమంత్రి మోదీ ప్రభుత్వం ప్రత్యేక బీమా సౌకర్యాన్ని అమలు చేస్తుందన్నారు. దీనిలోభాగంగా కేంద్రం 75శాతం, రాష్ట్ర ప్రభుత్వం 25శాతం ప్రీమియం చెల్లించేలా ఈ స్కీముల అమలువల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉండే కొబ్బరి కార్మికులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
‘ప్రధాని ప్రతి ఇంటి గడప దాటారు’
సారథ్యయాత్రలో భాగంగా అమలాపురంలోని కాపు కల్యాణమండపంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన బీజేపీ సమావేశంలో ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. కేంద్రం అమలు చేస్తున్న జలజీవన్ పెన్షన్ పథకం, కల్యాణ యోజన ఇలా అనేక పథకాల ద్వారా గడప దాటిన వ్యక్తి మోదీ అని ప్రశంసించారు. ఈనెల 30న డీనోటిఫై ట్రైబ్ పేరుతో ప్రధా ని విజయవాడలో బహిరంగసభ ఏర్పాటు చేశా రని, సంచార జాతులు కాదు సదాచార్య వారసులు వారి అభ్యున్నతికి పీఎం మోదీ మాత్రమే ముగ్గురు సభ్యులతో కేంద్ర కమిటీని ఏర్పాటు చేసి వారికి అవసరమైన ఆధార్‌తోపాటు అన్ని ధ్రువీకరణ పత్రాలను అందజేసేందుకు ఏర్పాట్లు చేశారని తెలిపారు. పార్టీ కోసం పనిచేసే ప్రతిఒక్కరినీ బీజేపీ అధిష్ఠానం గుర్తించి తగు ప్రాధాన్యం కల్పిస్తుందన్నారు. మరోఅతిథి ఎమ్మెల్సీ, మాజీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ పేదల అభ్యున్నతి కోసం ప్రధాని మోదీ కంకణబద్ధులై పనిచేస్తున్నారని, మారుమూల ప్రాంతం నుంచి ఆయన చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత బీజేపీ కార్యకర్తలపై ఉందన్నారు. బహిరంగ సభకు జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ అధ్యక్షత వహించారు. సభలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు మానేపల్లి అయ్యాజీవేమా, ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు గోపి శ్రీనివాస్, యువమోర్చా రాష్ట్ర నాయకుడు సునీల్‌రెడ్డి, అయిలా సత్యనారాయణ, తమనంపూడి రామకృష్ణారెడ్డి, రామ్మోహనరావు, జిల్లాశాఖ మాజీ అధ్యక్షుడు యాళ్ల దొరబాబు, కిసాన్‌మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లా పవన్‌కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శులు యిళ్ల సత్యనారాయణ, చీకురుమెల్లి శ్రీనివాస్, పాలూరి సత్యానందం, కర్రి చిట్టిబాబు, మోకా వెంకటసుబ్బారావు, మాలే శ్రీనివాసనగేష్, అయ్యల బాషా పాల్గొన్నారు.
నగరంలో సారథ్య యాత్ర
బీజేపీ చేపట్టే సారథ్యం యాత్రలో భాగంగా అమలాపురంలోని గడియారస్తంభం సెంటర్‌కు బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ చేరుకున్నారు. ఆయనకు పార్టీ శ్రేణులు అఖండ స్వాగతం పలికాయి. గడియార స్తంభం సెంటర్ నుంచి భారీ ర్యాలీగా బీజేపీ నాయకులు, పార్టీశ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఓపెన్ టాప్‌జీప్‌లో బీజేపీ చీఫ్ మాధవ్‌తోపాటు ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జిల్లా అధ్యక్షుడు అడాల సత్యనారాయణ, జిల్లా మాజీ అధ్యక్షుడు యాళ్ల దొరబాబు, నల్లా పవన్‌కుమార్ సహా వివిధప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు ఎక్కారు. గడియారస్తంభం సెంటర్‌నుంచి ముమ్మిడివరం గేట్, వాసవి కల్యాణ మండపం మీదుగా కాపునాడు కల్యాణ మండపం మీదుగా సారథ్య యాత్ర సాగింది.
చాయ్‌పే చర్చలో మాధవ్
కోనసీమను అన్నివిధాలా అభివృద్ధి చేయాలని, ముఖ్యంగా దివంగత లోక్‌సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి ఆశయాల్లో ఒకటైన రైల్వేలైన్ అభివృద్ధి జరగడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని బీజేపీ చీఫ్ మాధవ్ అన్నారు. అమలాపురంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సోమవారం జరిగిన చాయ్‌పే చర్చా కార్యక్రమంలో మాధవ్ పలు అంశాలపై మాట్లాడారు. కోనసీమను పర్యాటకంగా అభివృద్ధి చేయడంతోపాటు గోదావరి నదులు, సముద్రతీరం ప్రాంతం ఉన్న ఇక్కడ కొంకన్ రైల్వే తరహాలో ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలన్నారు. టెంపుల్ టూరిజంను డెవలెప్ చేయాలన్నారు. దర్శనీయ క్షేత్రాలన్నింటినీ ఒక సర్క్యూట్‌గా ఏర్పాటు చేసి కోనసీమను ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంవల్ల ఆటో కార్మికుల జీవనోపాధికి ఇబ్బందికరంగా ఉందని వారి ఆవేదనను తన దృష్టికి తెచ్చారని, ఈసమస్య పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృషిచేసి ఆటోకార్మికులను ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. యాళ్ల దొరబాబు, నల్లా పవన్, మానేపల్లి అయ్యాజీవేమా, అడబాల సత్యనారాయణతోపాటు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.