Share News

బిక్కవోలులో చురుగ్గా షష్ఠి ఉత్సవ పనులు

ABN , Publish Date - Nov 22 , 2025 | 11:50 PM

రాష్ట్ర వ్యాప్తంగా పేరొందిన బిక్కవోలు శ్రీకుమార సుబ్రహ్మణ్యేశ్వరస్వామి షష్ఠి ఉత్సవ పనులు చురు గ్గా సాగుతున్నాయి. ఈనెల 25 నుంచి వచ్చే నెల 2వరకూ ఉత్సవాలు నిర్వహిస్తామని, 26న షష్ఠి ఉత్సవం జరుపుతామని ఉత్సవ కమిటీ చైర్మన్‌ పల్లి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

బిక్కవోలులో చురుగ్గా షష్ఠి ఉత్సవ పనులు
52 అడుగుల ఎత్తులో తయారవుతున్న స్వాగతద్వారం

బిక్కవోలు, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా పేరొందిన బిక్కవోలు శ్రీకుమార సుబ్రహ్మణ్యేశ్వరస్వామి షష్ఠి ఉత్సవ పనులు చురు గ్గా సాగుతున్నాయి. ఈనెల 25 నుంచి వచ్చే నెల 2వరకూ ఉత్సవాలు నిర్వహిస్తామని, 26న షష్ఠి ఉత్సవం జరుపుతామని ఉత్సవ కమిటీ చైర్మన్‌ పల్లి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉత్సవాల సందర్భంగా బిక్కవోలు వంతెన వద్ద నుంచి జి.మామిడాడ వెళ్లే రోడ్డు వరకూ రం గురంగుల విద్యుత్‌ దీపాలతో అలంకరణ చేస్తున్నారు. ఆల యం ఎదుట భారీ చలువ పందిరి నిర్మిస్తున్నా రు. 52 అడుగుల ఎత్తులో భారీ స్వాగత ద్వారం నిర్మిస్తున్నారు. బిక్కవోలు మెయిన్‌రోడ్‌లో కూడా భారీ ఎత్తున అరపలు ఏర్పాటు చేసి విద్యుత్‌ దీ పాలతో తయారుచేసిన దేవతామూర్తులను ఏ ర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా మెయిన్‌రోడ్‌లో ఏర్పాటు చేసిన పద్మనాభస్వామి, అలివేలు మంగ, పద్మావతి సమేత వెంకటేశ్వరుడు అలం కరణలు ఆకట్టుకుంటున్నాయి.

  • ఏర్పాట్ల పరిశీలన

రాష్ట్ర వ్యాప్తంగా పేరొందిన బిక్కవోలు శ్రీకుమార సుబ్రహ్మణ్యస్వామి షష్ఠి ఉత్సవ ఏ ర్పాట్లను శనివారం దేవదాయశాఖ ఉపకమిషనర్‌ డీఎల్‌ వీ రమేష్‌ పరిశీలించారు. ఈ సం దర్భంగా ఆయన ఉత్సవ కమిటీ సభ్యు లు, అధికారులతో చర్చించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా స్వామి దర్శనాలు కల్పించాలని, వృద్ధులు, చంటి పిల్లల తల్లులకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు పల్లి శ్రీనివాసరెడ్డి, సభ్యులు పాలచర్ల శివప్రసాద్‌చౌదరి, చాగంటి సాయిబాబారెడ్డి, త్రిమూర్తులు, పల్లి రాజారెడ్డి, తనిఖీదారు బాలాజీరామ్‌ప్రసాద్‌, ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకెళ్ల భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 22 , 2025 | 11:50 PM