బైక్‌లు కొట్టేసి... డబ్బులతో జల్సాలు చేసి!
ABN , Publish Date - Dec 11 , 2025 | 12:17 AM
రాజమహేంద్రవరం, డిసెంబరు 10 (ఆంధ్ర జ్యోతి): ఉపాధి కోసం నగరానికి వచ్చాడు. చిన్న పనిలో కుదిరాడు. కష్టప డుతూ బతుకుతున్నాడు. ఓ రోజు బైక్ నడపాలనే కోరికతో మారుతాళంతో ప్రయత్నించగా ఫలించిం ది. డబ్బులు బాగా వస్తుం డడంతో బుద్ధి వక్రించి ద్విచక్ర వాహనాల దొంగగా మారాడు. ఆ డబ్బులతో
రాజమహేంద్రవరంలో ముగ్గురు దొంగల అరెస్ట్
రూ.17.40 లక్షల విలువైన 29 ద్విచక్రవాహనాల స్వాధీనం
రాజమహేంద్రవరం, డిసెంబరు 10 (ఆంధ్ర జ్యోతి): ఉపాధి కోసం నగరానికి వచ్చాడు. చిన్న పనిలో కుదిరాడు. కష్టప డుతూ బతుకుతున్నాడు. ఓ రోజు బైక్ నడపాలనే కోరికతో మారుతాళంతో ప్రయత్నించగా ఫలించిం ది. డబ్బులు బాగా వస్తుం డడంతో బుద్ధి వక్రించి ద్విచక్ర వాహనాల దొంగగా మారాడు. ఆ డబ్బులతో జాల్సాలు చేశాడు. ఆపై పోలీసుల వలకు చిక్కడంతో అతడితోపాటు దొంగతనం చేసిన వాహనాలు కొనుగోలు చేసిన ఇద్దరిని కటకటాల్లోకి నెట్టారు. బుధవారం సెంట్రల్ జోన్ డీఎస్పీ వై.శ్రీకాంత్ వివరాలను వెల్లడించారు.
హోటల్‌లో నైట్‌బాయ్‌గా చేరి...
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరుపేటకు చెందిన సబ్బు వీరబాబు చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. అమ్మమ్మ దగ్గర పెరిగాడు. తర్వాత రాజమహేం ద్రవరం వచ్చి పుష్కర్‌ఘాట్ సమీపంలోని ఓ హోటల్‌లో నైట్‌బాయ్‌గా ఉద్యోగంలో చేరాడు. పగలు వెల్డింగ్ పనులకు వెళ్లేవాడు. అయితే ఒక రోజు బైక్ నడపాలని అనుకున్నాడు. కానీ కొను క్కొనే పరిస్థితి లేదు. దీంతో పుష్కర్ ఘాట్ వద్ద పార్క్ చేసిన ఓ మోటార్ సైకిల్‌ని మారు తాళం తో ప్రయత్నించగా పని జరిగింది. కొంత కాలం ఆ బైక్‌ని వాడుకున్నాడు. తర్వాత స్నేహి తులైన కోసూరి పవన్ కుమార్, జర్గాని అప్పన్నకు అమ్మే శాడు. ఆ డబ్బులతో జల్సాలు చేశాడు. అదే పని బాగుందనుకుని ద్విచక్ర వాహనాల దొంగగా మారాడు. పుష్కర్‌ఘాట్, కోటగుమ్మం, మల్ల య్యపేట, సుబ్రహ్మణ్య మైదానం, లాలాచెరువు రోడ్, ఇస్కాన్ దేవాలయం, వాడపల్లి గుడి ప్రాంతాల్లో ద్విచక్రవాహనాలను దొంగిలించా డని డీఎస్పీ వివరించారు. వీరబాబుతో పాటు కొయ్యూరు మండలం మఠం భీమవరం గ్రామా నికి చెందిన పవన్‌కుమార్, గోకవరం మండలం అచ్యుతాపురానికి చెందిన అప్పన్నని అరెస్టు చేసి రూ.17.40 లక్షల విలువైన 29 ద్విచక్ర వాహనాల స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ద్విచక్ర వాహనాలకు యజమానులు వీల్ లాక్‌లు, జీపీ ఎస్‌లు అమర్చుకోవడం వంటి జాగ్రత్తలు తీసు కోవాలని త్రీటౌన్ సీఐ వీ.అప్పారావు సూచిం చారు. దొంగలను అరెస్టు చేయడంలో ప్రతిభ చూపిన సీఐ వి.అప్పారావు, ఎస్‌ఐ ఎండీ జుబేర్, హెచ్‌సీలు వీ.కృష్ణ, ఎన్.వెంకట రామయ్య, ఎస్.చంద్రశేఖర్, కానిస్టేబుళ్లు బి.విజయ్ కుమార్, కె.పవన్ కుమార్, ఆర్.సుబ్రహ్మణ్యాన్ని ఎస్పీ నరసింహకిషోర్ ప్రత్యేకంగా అభినందించారు.