Share News

బైక్‌ దొంగల ముఠా అరెస్ట్‌

ABN , Publish Date - Sep 06 , 2025 | 12:39 AM

కోరుకొండ, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): కొంతకాలంగా ఇంటి ముందు పార్కు చేసిన బైక్‌లను పట్టుకుపోతున్న దొంగల ముఠాను కోరుకొండ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. వారి నుంచి 11 స్కూటీలు, ఒక స్ల్పెండర్‌ బైక్‌ స్వా ధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గాదరా

బైక్‌ దొంగల ముఠా అరెస్ట్‌
బైక్‌ దొంగలను పట్టుకున్న కోరుకొండ పోలీసులు

12 వాహనాల స్వాధీనం

కోరుకొండ, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): కొంతకాలంగా ఇంటి ముందు పార్కు చేసిన బైక్‌లను పట్టుకుపోతున్న దొంగల ముఠాను కోరుకొండ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. వారి నుంచి 11 స్కూటీలు, ఒక స్ల్పెండర్‌ బైక్‌ స్వా ధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గాదరాడ గ్రామానికి చెందిన ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం కోరుకొండ పోలీస్‌స్టేషన్‌ వద్ద నార్త్‌జోన్‌ డీఎస్పీ వై.శ్రీకాంత్‌ వివరాలను మీడియాకు వెల్లడించారు. గాదరాడకి చెందిన అల్లాడి విజయ్‌కుమార్‌ పాత నేరస్తుడు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడు. మద్యం, జూదానికి బానిసై బైక్‌లు దొంగతనాలు చేస్తున్నాడు. కోరుకొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 2 బైక్‌లు, రాజమహేంద్రవరం త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో పరిధిలో 4 బైక్‌లు, వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 1, రాజానగరం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 1, బొమ్మూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 1, సీతానగరం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 1, ప్రకాష్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిఽధిలో రెండు వెరసి 12 బైక్‌లు దొంగిలించాడు. విజయ్‌కుమార్‌, వనుం సురేష్‌, వనుం లోవరాజు బైక్‌ దొంగతనాల్లో భాగస్తులు. సీఐ వై.సత్యకిషోర్‌కు వచ్చిన సమాచారం మేరకు ఈ ముగ్గురిని శుక్రవారం ఎస్‌ఐ నాగార్జున, సిబ్బంది గాదరాడ గ్రామ శివారులో అదుపులోకి తీసుకుని బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. కేసులో ప్రతిభ కనబరిచిన ఎస్‌ఐ నాగార్జున, హెచ్‌సీ శ్రీను, కానిస్టేబుల్స్‌ పవన్‌ వరప్రసాద్‌, బాపినాయుడులను అభినందించారు.

Updated Date - Sep 06 , 2025 | 12:39 AM