Share News

ఖరీదైన ద్విచక్ర వాహనాలే టార్గెట్‌

ABN , Publish Date - Aug 14 , 2025 | 01:22 AM

రాజమహేంద్రవరం, ఆగస్టు 13 (ఆంధ్ర జ్యో తి): ఖరీదైన ద్విచక్ర వాహనాలే టార్గెట్‌గా చోరీ లకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను ప్రకాశం నగర్‌ పోలీసులు పట్టుకున్నారు. నిందితులపై వివిధ పోలీస్టేషన్లలో 18 కేసులు ఉండగా వారి నుంచి రూ.19 లక్షల విలువైన 18 ద్విచక్ర వాహ నాలను స్వాధీనం చేసు

ఖరీదైన ద్విచక్ర వాహనాలే టార్గెట్‌
నిందితుల వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు

రాజమహేంద్రవరంలో ఇద్దరు దొంగల అరెస్ట్‌

రూ.19 లక్షల విలువైన సొత్తు రికవరీ

నిందితులపై 18 కేసులు

రాజమహేంద్రవరం, ఆగస్టు 13 (ఆంధ్ర జ్యో తి): ఖరీదైన ద్విచక్ర వాహనాలే టార్గెట్‌గా చోరీ లకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను ప్రకాశం నగర్‌ పోలీసులు పట్టుకున్నారు. నిందితులపై వివిధ పోలీస్టేషన్లలో 18 కేసులు ఉండగా వారి నుంచి రూ.19 లక్షల విలువైన 18 ద్విచక్ర వాహ నాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను సెంట్రల్‌ జోన్‌ డీఎస్పీ కె.రమేశ్‌ బాబు బుధవా రం వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమ హేంద్రవరం నగరంలో ద్విచక్ర వాహనాల దొంగ తనాలపై జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్‌ ఆదేశాల తో ప్రత్యేక నిఘా పెట్టారు. బుధవారం సీఐ బా జీలాల్‌ ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేస్తుం డగా కాకినాడ గాంధీనగర్‌కి చెందిన ఇంటి సురే ంద్ర అనుమానాస్పదం గా కనిపించగా ప్రశ్నించా రు. 2003 నుంచి దొంగత నాలు చేస్తున్నానని ఒ ప్పుకు న్నాడు. అతడిపై అనకాపల్లి, రామచంద్రా పురం, కాకినా డ, పామర్రు, ప్రకాశంనగర్‌ పోలీస్‌ స్టేషన్లలో కేసులు ఉన్నాయి. రామచంద్రాపురం పీఎస్‌లో నమోదైన కేసులో చివరిగా 20 24లో పట్టుబడి బెయిల్‌పై బయటకు వచ్చాడు. మళ్లీ దొంగ తనాలు చేస్తూ స్టిక్క రింగ్‌ చేసే పిఠాపురాని కి చెందిన కామిరెడ్డి యేసుబాబుతో కలిసి ఖరీదైన వాహనాలను చోరీలు చేశారని డీఎస్పీ తెలిపారు. వీళ్లపై ప్రకా శంనగర్‌ పీఎస్‌లో 7, త్రీటౌన్‌లో 2, బొమ్మూరులో 2, జగ్గంపేటలో 3, కడియం, గోకవరం, పెద్దాపు రం, పిఠాపురంలలో ఒక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయాయన్నారు. నిందితుల నుంచి రూ.19 లక్షల విలు వైన వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసులో ప్రతిభ చూపిన సీఐ బాజీలాల్‌, ఎస్‌ఐ సతీష్‌, హెచ్‌సీ నాగరాజు, క్రైమ్‌ పీసీలు శ్రీనివాసరావు, ప్రదీప్‌కుమార్‌, వీర బాబు, దుర్గాప్రసాద్‌, శివప్రసాద్‌ను ఎస్పీ అభిన ందించి రివార్డులు ప్రకటించారని పేర్కొన్నారు.

Updated Date - Aug 14 , 2025 | 01:22 AM