మోటార్‌సైకిళ్లే టార్గెట్..
ABN , Publish Date - Sep 17 , 2025 | 12:27 AM
పెరవలి, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): మోటార్ సైకిళ్లను చోరీ చేసిన ఐదుగురు అంతర్‌జిల్లా దొంగలను పెరవలి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 26 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కొవ్వూరు డీఎస్పీ జి.దేవకుమార్ మంగళవారం తూర్పుగోదావరి జిల్లా పెరవలి పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు తెలిపారు. తుమ్మగంటి ధనుష్ (తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లి), విశ్వనాధుల దేవిశ్రీ
ఐదుగురు అంతర్‌జిల్లా దొంగలను పట్టుకున్న పెరవలి పోలీసులు
రూ.40 లక్షల విలువైన 26 బైక్‌ల స్వాధీనం
పెరవలి, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): మోటార్ సైకిళ్లను చోరీ చేసిన ఐదుగురు అంతర్‌జిల్లా దొంగలను పెరవలి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 26 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కొవ్వూరు డీఎస్పీ జి.దేవకుమార్ మంగళవారం తూర్పుగోదావరి జిల్లా పెరవలి పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు తెలిపారు. తుమ్మగంటి ధనుష్ (తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లి), విశ్వనాధుల దేవిశ్రీప్రసాద్, అబ్బిరెడ్డి పాపారావు (కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి)లు కలిసి బైక్ చోరీలకు పాల్పడే వారు. వారి ముగ్గురిని చూసి ధనుష్ తమ్ముడైన నెక్కంటి యువరాజ్ కూడా దొంగతనాలు చేసి డబ్బు సంపాదించాలనుకుని వనచర్ల శక్తిరాజు, కూనపరెడ్డి వీరబాబు(ఖండవల్లి)తో కలిసి మోటారుసైకిళ్ల దొంగతనాలకు పాల్పడ్డారు. వారు దొంగిలించిన మోటారు సైకిళ్లన్నీ వారి ఇళ్ల వద్ద పెట్టుకుని ఒక్కసారిగా అమ్ముదామనుకున్నారని డీఎస్పీ తెలిపారు. వారిలో ఐదుగురిని ఖండవల్లి వద్ద పట్టుకున్నట్టు చెప్పారు. కేసు విచారణలో పెరవలిలో 4, ఉండ్రాజవరంలో 1, రాజమండ్రిలో 6, బొమ్మూరులో 1, పెనుగొండలో 3, పెనుమంట్రలో 2, ఇరగరవంలో 1, రావులపాలెంలో 3, ప్రత్తిపాడులో 2, సామర్లకోటలో 2, తునిరూరల్‌లో 1, విశాఖ జిల్లా ఆనందపురంలో 1, ఎంవీపాలెంలో 1 కేసులు నమోదు కాగా మొత్తం 26 మోటారు సైకిళ్లను దొంగతనం చేసినట్టు తేలిందన్నారు. వాటిలో సుజుకీ మోటారు సైకిళ్లు 15, రాయల్ ఎన్‌ఫీల్డ్ 6, పల్సర్‌బైక్‌లు 4, హెచ్‌ఎఫ్ డీలక్స్ 1 ఉన్నట్టు చెప్పారు. మొత్తంలో 25 కేసుల్లో ఐదుగురు దొంగలను అరెస్టు చేశామన్నారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న మోటారు సైకిళ్ల విలువ సుమారు రూ.40లక్షలు వరకు ఉంటుందని తెలిపారు. ఖండవల్లికి చెందిన మోతరపు శివప్రసాద్ ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. నిందితులను పట్టుకోవడానికి కృషి చేసిన పెరవలి ఎస్‌ఐ ఎం.వెంకటేశ్వరరావు, నిడదవోలు సీఐ పీవీజీ తిలక్, ట్రైనీ ఎస్‌ఐ కె.సౌజన్య, పోలీసుస్టేషన్ సిబ్బంది కె.శ్రీహరి, నరేంద్ర, ముత్యాలు, గంగాధరరావు, ప్రసాద్, రమేష్, హనుమంతు, శ్రీను, పవన్, సాంభయ్య, జాకీర్ రెహ్మాన్, జి.అనిల్‌ను ఎస్పీ అభినందించినట్టు, వారికి రివార్డులు ఇస్తున్నట్టు డీఎస్పీ పేర్కొన్నారు.
సర్పవరంలో యువకుడి అరెస్ట్
11 బైక్‌లు స్వాధీనం
సర్పవరం జంక్షన్, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): వివిధ ప్రాం తాల్లో మోటార్ సైకిళ్లు చోరీ చేసిన నిందితుడిని అరెస్ట్ చేసి 11 వాహనాలను సర్పవరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వివరాలను కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వో బి.పెద్ది రాజు మంగళవారం విలేకర్లకు తెలిపారు. బైక్ చోరీల నివారణ, చోరీ సొత్తు స్వాధీనం కోసం కాకినాడ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎ స్‌డీపీ వో పాటిల్ దేవరాజ్ మనీష్ పర్యవేక్షణలో సీఐ పెద్దిరాజు ఆధ్వర్యంలో నిందితుల కోసం ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టామన్నారు. సామర్లకోట మండలం పండ్రవాడ గ్రామానికి చెందిన పెంకే తేజా(20) బైక్ చోరీలకు పాల్పడుతున్నట్టు గుర్తి ంచి మంగళవారం సర్పవరం ఎస్‌ఐ పి.శ్రీనివాస్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది అరెస్ట్ చేశారు. నిందితుడు ఎత్తుకుపోయిన 11 బైక్‌లను స్వాధీ నం చేసుకున్నామని సీఐ పెద్దిరాజు తెలిపారు. వాటి విలువ సుమారు రూ.6.50 లక్షలు ఉంటు ందన్నారు. నిందితుడిని పట్టుకున్న ఎస్‌ఐ శ్రీనివాస్‌కుమార్, హెచ్‌సీలు సత్తిబాబు, రాజు, గణేష్, కానిస్టేబుల్స్ రవి, శ్రీనివాస్, అనిల్, చిన్న బాబు, కిషోర్‌లను ప్రత్యేకంగా అభినందించారు.