బైక్ సీటు కింద బుస్ బుస్...
ABN , Publish Date - Oct 28 , 2025 | 11:52 PM
తుని రూరల్, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా తుని మండలం రేఖవానిపాలెం సమీపంలో మంగళవారం మధ్యాహ్నం బైక్ సీటు కింద
పడగ విప్పి కూర్చున్న తాచుపాము
తుని రూరల్, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా తుని మండలం రేఖవానిపాలెం సమీపంలో మంగళవారం మధ్యాహ్నం బైక్ సీటు కింద తాచుపాము కనిపించి భయపెట్టేసింది. తుని నుంచి విధులు నిర్వహించేందుకు కోటనందూరు పోలీస్ స్టేషన్‌కి వెళ్తున్న శివాజీ అనే కానిస్టేబుల్ బైక్ నుంచి ఒక్కసారిగా శబ్దం వచ్చింది. కింద నుం చి ఎవరో కొడుతున్నట్టు అనిపించింది. దీంతో శివాజీ బైక్ దిగి చూడగా ఏమీ కనిపించలేదు. అలా పరి శీలిస్తూ సీటు తెరిచిచూడగా తాచుపాము పడగ విప్పి కనిపించింది. ఊహించని ఈ పరిణామంతో స్థానికులు భయాం దోళనకు గురయ్యారు. శివాజీ ధైర్యంగా పా మును స్థానికుల సాయ ంతో సమీపంలోని కొండ ప్రాంతంలో వదిలేశాడు.