బెల్ట్ తీస్తారట!
ABN , Publish Date - Nov 09 , 2025 | 12:47 AM
సారాతో పాటు బెల్ట్ షాపుల్లో మద్యం విక్ర యాల్లేకుండా చేయాలని ప్రభుత్వం నిర్ణ యిం చింది.
నవోదయంలో కాకినాడ వెనుకంజ
తూర్పు, కోనసీమ ముందంజ
600 మద్యం దుకాణాలు
పలు చోట్ల ఎమ్మార్పీ కంటే ఎక్కువ
మందుబాబుల బేజారు
అయినా పట్టని అధికారులు
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
సారాతో పాటు బెల్ట్ షాపుల్లో మద్యం విక్ర యాల్లేకుండా చేయాలని ప్రభుత్వం నిర్ణ యిం చింది. గత శుక్రవారం రాష్ట్ర ఎక్సయిజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎక్సయిజ్ అధికారు లతో నవోదయం-2.0, బెల్ట్‌షాపుల పరిస్థితిపై సమీక్షించారు. ఎక్కడా ఒక్క బెల్ట్ షాపు ఉండ కూదని ప్రభుత్వం నిర్ణయించి నట్టు ప్రకటిం చారు. దీంతో అధికారులు ఆరా తీసి కేసులు పెడుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తో పాటు కొవ్వూరు డివిజన్‌లో సుమారు 600 వరకు అధికారిక మద్యం షాపులు ఉన్నాయి. ఆయా షాపుల యజమానులే సిండికేట్‌గా ఏర్పడి బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. కొంద రైతే ఆర్గనైజ్జ్‌డ్‌గా బెల్ట్ షాపులు నిర్వహిస్తు న్నట్టు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో చాలా చోట్ల ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు మద్యం విక్రయాలు జరుగు తున్నాయి. నవోదయం 2.0లో భాగంగా ఎక్కడా సారా ,బెల్ట్ షాపులు ఉండకూడదని, నిబంధనల ప్రకారం మద్యం విక్రయాలు జరగాలని ప్రభుత్వం అధికారుల ను ఆదేశిం చింది.దీనిలో భాగంగా తూర్పుగోదావరి, అంబే డ్కర్ కోనసీమ జిల్లాల్లో సారాపై ఉక్కుపాదం మోపుతున్నారు. సారా అరికట్టడంలో కాకినాడ జిల్లా వెనుక బడి ఉంది. ఈ నెల 15వ తేదీ లోపు అక్కడ కూడా సారారహితంగా చేయ వలసి ఉందని ప్రభుత్వం ఆదేశించింది.ఈ నేపఽథ్యంలోపూర్తిగా నిర్మూలించాలనే ల క్ష్యంతో ముందుకు వెళుతున్నారు.
ఎక్సయిజ్ అధికారుల దూకుడు
మూడు జిల్లాల ఎక్సయిజ్ అధికారులు దూకుడు పెంచారు. బెల్ట్‌షాపులపై దాడులు ఆరంభించారు. ఏడాదిలోపులో వంద లాది బెల్ట్‌షాపులపై కేసులు పెట్టి నట్టు తూర్పుగోదావరి ఎక్స్జైజ్ సూపరింటెండెంట్ లావణ్య తెలిపారు. రాజమండ్రి సౌత్ స్టేషన్ పరిధిలో కేవలం పది రోజుల్లో 8 షాపులపై కేసులు పెట్టి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. అధికార మద్యం షాపుల నిర్వాహకుల వాదన వేరేగా ఉంది. తమకు ప్రభుత్వం ఇస్తానని చెప్పిన 20 శాతం కమీషన్ ఇవ్వడంలేదని, కేవలం 13.5 శాతం మాత్రమే ఇస్తుండడంతో నష్టాల్లో మునిగిపోయామనే వాదన వినిపిస్తున్నారు.అంబేద్కర్ కోనసీమ జిల్లా మద్యం వ్యాపారాలు ఇటీవల ఒక మీటింగ్ పెట్టి 15 రోజుల్లో తమ సమ స్యలు పరిష్కరించకపోతే తాము షాపులు నిర్వహించలేమని అల్టిమేటం ఇచ్చారు..