వృద్ధులతో గౌరవంగా మెలగాలి
ABN , Publish Date - Jun 16 , 2025 | 01:13 AM
వృద్ధుల పట్ల దయతో గౌరవంగా మెలగడం సమాజంలోని ప్రతిఒక్కరి బాధ్యతని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎన్.శ్రీలక్ష్మి పేర్కొన్నారు. ఆదివారం ప్రపంచ వృద్ధులపై వేధింపుల నివారణ దినం సందర్భంగా ఆర్యాపురం ఏబీ నాగేశ్వరరావు పా ర్కులోని డే కేర్ భవనంలో సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు.

డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి శ్రీలక్ష్మి
ప్రపంచ వృద్ధులపై వేధింపుల నివారణ దినం
రాజమహేంద్రవరం, జూన్ 15(ఆంధ్రజ్యోతి): వృద్ధుల పట్ల దయతో గౌరవంగా మెలగడం సమాజంలోని ప్రతిఒక్కరి బాధ్యతని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎన్.శ్రీలక్ష్మి పేర్కొన్నారు. ఆదివారం ప్రపంచ వృద్ధులపై వేధింపుల నివారణ దినం సందర్భంగా ఆర్యాపురం ఏబీ నాగేశ్వరరావు పా ర్కులోని డే కేర్ భవనంలో సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. కుటుంబ సంబంధ బాంధవ్యాల్లో కాలక్రమేణా వస్తున్న మార్పుల వల్ల వృద్ధులు నిరాదరణకు, వేధింపులకు గురవు తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అందువల్ల ఆర్థిక పర మైన విషయాల్లో వారు తగు జాగ్రత్తలు తీసుకో వడం ఆవశ్యకమన్నారు. వీలునామా లు వంటివి రాసే సమయంలో భావో ద్వేగాలకు అతీతంగా ఆలోచన చే యాలన్నారు. తమ తదనంతరం మాత్రమే అవి అమలవుతాయనే స్పష్టంగా రాసుకోవడం శ్రేయస్కరమ ని చెప్పారు. ఇవాళ పెద్దల నుంచి పిల్లలవైపే ప్రేమ ప్రవహిస్తోందని, పిల్లల నుంచి ఆ ప్రవాహం ఉండడం లేదని ఆమె స్పష్టం చేశారు. న్యాయ సేవాధికార సంస్థ వృద్ధులకు అంది స్తున్న ఉచిత న్యాయ సేవలను వివరించారు. 15100కి ఫోన్ చేయడం ద్వారా కూడా న్యాయ సేవలు పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు అశోక్‌కుమార్ జైన్, కార్య దర్శి లక్ష్మణరావు, పారా లీగల్ వలం టీర్లు వీర్రాజు, ప్రసాద్, న్యాయవా దులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.