అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Oct 26 , 2025 | 11:59 PM
మొంథా తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సూచించారు. తుఫాను ప్రభావంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున సోమ, మంగళవారాల్లో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు
రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 26(ఆం ధ్రజ్యోతి): మొంథా తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సూచించారు. తుఫాను ప్రభావంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున సోమ, మంగళవారాల్లో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యుత్, తాగునీరు, రవాణా తదితర సేవల్లో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.అవసరమైతేనే బయటకు రావాలని, ముందుగానే నిత్యావసరాలు సమకూర్చుకోవాలని సూచించారు.నగరంలో డివిజన్ ఇన్‌చార్జిలు తమ పరిధిలో ఏదైనా సమస్య ఏర్పడితే తక్షణమే స్పందించి అధికారులకు కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
అధికారులు సమష్టిగా పనిచేయాలి
అనపర్తి అక్టోబరు 26(ఆంధ్రజ్యో తి): మొంథా తుఫాన్ నేపథ్యంలో అధికారులం తా సమష్టిగా పనిచేయాలని ఎంపీడీవో ఎం.రా మకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక మండ ల పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించి అధికారుల సమీక్షా సమావేశంలో ఆయన మా ట్లాడుతూ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశీలించి అవసరమైన సమాచారాన్ని మండల కేంద్రానికి చేరవేయాలన్నారు. సహాయక చర్యలో పాల్గొనేందుకు పోలీసులు, ఫైర్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ సమావేశంలో మండల ప్రత్యేకాధికారి, డీఎల్పీవో నాగలత, తహశీల్దార్ అనిల్‌కుమార్, ఫైర్ అధికారి శ్రీనివాసరెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు పాల్గొన్నారు.
పాఠశాలలకు రెండు రోజులు సెలవులు
రంగంపేట, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): తు ఫాను కారణంగా వాతావరణంలో మార్పుల నే పథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సోమ,మంగళవారం సెలవు ప్రకటించినట్టు ఎంఈవో లు కె.శ్రీనివాసరావు, పి.మధుసూధనరావు ఆది వారం తెలిపారు. ప్రైవేటు మేనేజ్‌మెంట్‌వారు ఎవరైనా ఈ రెండు రోజుల్లో స్టడీక్లాసులు, అదనపు తరగతుల పేరుతో పాఠశాలలు నిర్వహిస్తే శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అలాగే భద్రత చర్యల నిమిత్తం ఎంఈవో కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పా టు చేసినట్టు చెప్పారు. తుఫాను కారణంగా ప్ర జలకు ఎటువంటి సహాయం అవసరమైనా ఎం ఈవో-1: 94918 61761, ఎంఈవో-2: 98480 67223, రంగంపేట క్లస్టర్: 90005 45353, ఈలకొలను క్లస్టర్: 94949 57268, సింగంపల్లి క్లస్టర్: 96666 27449, ఎంఈవో కార్యాలయం: 63013 03014, 89851 60405 నెంబర్లుకు ఫోన్ చేయాలని ఎంఈవోలు పేర్కొన్నారు.