రిజర్వేషన్ల శాతం మరింత పెంచాలి
ABN , Publish Date - Nov 28 , 2025 | 12:09 AM
యానాం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): రిజర్వేషన్ల శాతాన్ని మరిం త పెంచాలని, వెనుకబడిన సామా జికవర్గాలంతా ఐక్యంగా ఉంటూ హక్కుల సాధనకు సమష్టిగా కృ షి చేయాలని బీసీ ప్రతినిధులు పిలుపు నిచ్చారు. యానాం కామిశెట్టివారివీధిలోని గీతా మందిరం లో ఆంధ్రపదేశ్ బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బీ
బీసీ ప్రతినిధుల పిలుపు
యానాంలో ఏపీ బీసీ ఫెడరేషన్ సమావేశం
యానాం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): రిజర్వేషన్ల శాతాన్ని మరిం త పెంచాలని, వెనుకబడిన సామా జికవర్గాలంతా ఐక్యంగా ఉంటూ హక్కుల సాధనకు సమష్టిగా కృ షి చేయాలని బీసీ ప్రతినిధులు పిలుపు నిచ్చారు. యానాం కామిశెట్టివారివీధిలోని గీతా మందిరం లో ఆంధ్రపదేశ్ బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బీసీ సంఘ నేత, పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ బీసీ ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర బీసీ ప్రతినిధులు రిటైడ్ జస్టీస్ ఈశ్వరయ్య, బీసీ జేఏసీ ప్రతినిధి డాక్టర్ విశరాదన్ మహారాజ్ (తెలంగాణ), కుడిపూడి సూర్యనారాయణ, రెడ్డి సుబ్రహ్మణ్యం, పితాని బాలకృష్ణ, ఉభయగోదావరి జిల్లాలకు ముఖ్య బీసీ నాయకులు హాజ రయ్యారు. మల్లాడి మాట్లాడుతూ సుమారు 4 గంటలపా టు మేధావులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ లు ఏవిధంగా రిజర్వేషన్లు అమలుచేస్తున్నాయనే అంశాల పై చర్చించామన్నారు. 15రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగా ణ, పుదుచ్చేరిలో ఉన్న ఇబ్బందులను ఈ 3 రాష్ట్రాల ప్రభుత్వాలకు తెలియజేయడం జరుగుతుందన్నారు. భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సంబంధింత కేంద్రశాఖ మంత్రి, అధికారులతో పాటు 3 రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు, గవర్నర్, ఇతర మంత్రులను కలిసి రిజర్వేషన్‌కు సంబంధించిన అంశాలపై వివరిస్తామన్నారు. తమిళనాడు మాదిరిగానే స్థానిక ఎన్నికల్లో 69 శాతం రిజరేషన్‌తో పాటు విద్యా,ఉద్యోగాల్లో కూడా ఆంధ్రప్రదేశ్‌లో రిజర్వేషన్ సాధించుకోవడానికి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని ఈశ్వరయ్య తెలిపారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు. విడిపోయిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బీసీ, ఎస్సీ,ఎస్టీ సోదరులంతా ఒక్కటై మనకు కావాల్సిన హక్కలన్నీ సాధించుకోవాలని మహారాజ్ అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రిజర్వేషన్ల శాతాన్ని మరింత పెంచేలా త్వరలో జరిగే రెండో సమావేశంలో సంపుర్ణ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.