రూ.వెయ్యి కోట్లతో ఆదరణ పునఃప్రారంభం
ABN , Publish Date - Sep 07 , 2025 | 01:00 AM
కార్పొరేషన్(కాకినాడ), సెప్టెంబరు 6(ఆంధ్ర జ్యోతి): రూ.వెయ్యి కోట్ల నిధులతో ఆదరణ పథకాన్ని పునఃప్రారంభించి, కులవృత్తుల వారికి పనిముట్లు అందిస్తామని రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చైర్‌పర్సన్ రెడ్డి అనంతకుమారి తెలిపారు. కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా శనివారం మధ్యాహ్నం స్థానిక ప్రగతి
కులవృత్తుల వారికి పనిముట్లు ఇస్తాం
రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చైర్‌పర్సన్ రెడ్డి అనంతకుమారి
కార్పొరేషన్(కాకినాడ), సెప్టెంబరు 6(ఆంధ్ర జ్యోతి): రూ.వెయ్యి కోట్ల నిధులతో ఆదరణ పథకాన్ని పునఃప్రారంభించి, కులవృత్తుల వారికి పనిముట్లు అందిస్తామని రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చైర్‌పర్సన్ రెడ్డి అనంతకుమారి తెలిపారు. కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా శనివారం మధ్యాహ్నం స్థానిక ప్రగతిభవన్‌లోని డీఆర్డీఏ సమావేశహాలులో ఆమె కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రమణ్యం, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు, బీసీ కార్పొరేషన్ జిల్లా విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏ.శ్రీనివాసరావు, వివిధ బీసీ కులాల సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ల డైరెక్టర్లతో సమావేశం నిర్వహించారు. బీసీ కార్పొరేషన్ ద్వారా వెనుకబడిన తరగతుల ప్రజల సంక్షేమ, ఆర్థిక ప్రగ తికి చేపట్టివలసిన ప్రణాళికలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో 13 జిల్లాల్లో బీసీ కార్పొరేషన్ కార్యాలయాలు పనిచేస్తున్నాయని, త్వరలో 26 జిల్లాలన్నిటిలో కార్పొరేషన్ కార్యాలయాలు ఏర్పాటు చే స్తామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో బీసీ కార్పొరేషన్ కమిటీని నియమించలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెం టనే కార్పొరేషన్ పునరుద్ధరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. 54 కుల కార్పొరేషన్ల ఏర్పా టు జరుగుతోందని, ఇప్పటికే 34 కుల కార్పొరేషన్లకు 236 మంది డైరెక్టర్లను నియమించగా, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 38 మందికి ఈ పదవులు లభించాయని, మిగిలిన కార్పొరేషన్ డైరెక్టర్ల నియామకాలు త్వరలోనే జరుగుతాయని పేర్కొన్నారు. బీసీ వర్గాలకు చెందిన చిన్న వ్యాపారులకు ఈ ఏడాది రూ.200 కోట్లు సబ్సిడీ రుణాలు కల్పించనున్నామని, పేద బీసీ విద్యార్థులకు ఉపకారవేతనాలు, విదేశీ విద్యారుణా లు కల్పిస్తామని ఆమె తెలియజేశారు.
46,944 మందికి కుట్టు శిక్షణ
బీసీ కార్పొరేషన్ ద్వారా ఇప్పటివరకూ 46, 944 మందికి కుట్టు మిషన్ శిక్షణ ఇచ్చామని, త్వరలో శిక్షణ పొందిన వారికి ఉచితంగా కుట్టు మిషన్లు అందించి ఉపాధి కల్పిస్తామని అనంతకుమారి తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీలకు ఎన్టీఆర్ 24 శాతం రిజర్వేషన్ కల్పించగా..చంద్రబాబు దానిని 34 శాతానికి పెంచారని, వైసీపీ ప్రభుత్వం మళ్లీ 24 శాతానికి కుదించే దారుణానికి పాల్పడిందన్నారు. కూటమి ప్రభుత్వం రిజర్వేషన్లను మళ్లీ పెం చేందుకు కృషిచేస్తోందన్నారు. ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బీసీలకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించిన ఘనత సీఎం చంద్రబాబుదేనన్నారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు బీసీ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేసిందన్నారు. సమావేశంలో శెట్టిబలిజ, రజక, తూర్పుకాపు, కొప్పుల వెలమ, గవర, పద్మశాలి, ఆగ్నికుల క్షత్రియ, గౌడ, యాదవ, నాయీబ్రహ్మణ, శాలివాహన కార్పొరేషన్ల డైరెక్టర్లు, బీసీ సంక్షేమ సంఘాల ప్రతి నిధులు పాల్గొన్నారు.