రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీల్లో విజేతలుగా ఉమ్మడి జిల్లా జట్లు
ABN , Publish Date - May 23 , 2025 | 12:32 AM
పిఠాపురం, మే 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీల్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా బాల, బాలికల జట్లు విజేతలుగా నిలిచాయి. చిత్తూరులో జరిగిన ఆంధ్ర రాష్ట్ర 10వ రాష్ట్రస్థాయి జూనియర్ బాలబాలికల చాంపియన్‌షిప్ పోటీల్లో ఉమ్మడి జిల్లా జట్లు పాల్గొన్నాయి. వరుసగా ఐదోసారి బాలబాలికల వి
పిఠాపురం, మే 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీల్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా బాల, బాలికల జట్లు విజేతలుగా నిలిచాయి. చిత్తూరులో జరిగిన ఆంధ్ర రాష్ట్ర 10వ రాష్ట్రస్థాయి జూనియర్ బాలబాలికల చాంపియన్‌షిప్ పోటీల్లో ఉమ్మడి జిల్లా జట్లు పాల్గొన్నాయి. వరుసగా ఐదోసారి బాలబాలికల విభాగాల్లో విజేతలుగా నిలిచి ట్రోఫీని కైవసం చేసుకున్నారు. విజేతలకు ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ రవినాయుడు, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, బాస్కెట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చెంగల్రాయుడు, టెక్నికల్ కమిటీ చైర్మన్ సురేష్‌బాబు షీల్డులు అందజేశారు. విజేతలను జనసేన పిఠాపురం ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు, మురాలశెట్టి సునీల్‌కుమార్, పిఠాపురం బాస్కెట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ మొగలి కాశీవిశ్వనాథ్, ఉమ్మడి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గన్నమనేని చక్రవర్తి, బొజ్జా మాణిక్యాలరావు, కె.సుందరకుమార్ అభినందించారు.