Share News

43 దరఖాస్తులు.. 9 బార్లు కేటాయింపు

ABN , Publish Date - Aug 31 , 2025 | 12:57 AM

ఎప్పుడూ కోలాహలంగా జరిగే బార్‌ల కేటాయింపు ఇప్పుడు పేలవంగా జరిగింది. అరగంటలో లాటరీ ప్రక్రియ ముగిసింది.

43 దరఖాస్తులు.. 9 బార్లు కేటాయింపు
బార్లకు లాటరీ తీసిన ఆర్‌డీవో కృష్ణనాయక్‌

రాజమహేంద్రవరం, ఆగస్టు 30 (ఆంధ్ర జ్యోతి): ఎప్పుడూ కోలాహలంగా జరిగే బార్‌ల కేటాయింపు ఇప్పుడు పేలవంగా జరిగింది. అరగంటలో లాటరీ ప్రక్రియ ముగిసింది. తూర్పుగోదావరి జిల్లాలో ఓపెన్‌ కేటగిరీలో 22, కల్లుగీత కార్మికుల కేటగిరీలో నిదడవోలు, రాజమండ్రి, కొవ్వూరు ఒక్కోటి చొప్పున బార్‌ లను కేటాయించారు. ఓపెన్‌లో 6 బార్‌లకు 24 దరఖాస్తులు, కల్లుగీత కార్మికుల కేటగిరీకి 19 దరఖాస్తులు వచ్చాయి. బార్‌ల కేటా యింపునకు శనివారం ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో కృష్ణ నాయక్‌ లాటరీ తీశారు. కల్లుగీత కార్మికుల కేటగిరీలో రాజమండ్రికి 6, నిడద వోలులోని బార్‌కి 9 దరఖాస్తులు వచ్చాయి. కొవ్వూరు బార్‌కి ఒక్కటే దరఖాస్తు రావడంతో వారినే ఎంపిక చేశారు. కల్లుగీత కార్మికులకు వార్షిక రుసుంలో సగం రాయితీ ఉండడంతో దరఖాస్తులు వచ్చాయి. ఓపెన్‌ కేటగిరీలో మాత్రం 6 బార్‌లకు నాలుగు చొప్పున 24 దరఖాస్తులు వచ్చాయి. ఇవి కూడా అధికారుల ఒత్తిడితో సమర్పించామని వ్యాపారులు చెబు తున్నారు. జిల్లాలో ఒకటో తేదీ(రేపటి) నుంచి రాజమండ్రిలో 7, నిడదవోలు, కొవ్వూరులో ఒక్కోటి చొప్పున మొత్తం 9 బార్‌లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇప్పటి వరకూ 20 వరకూ బార్‌లు ఉన్నాయి. దరఖాస్తులు రాకుండా ఉన్న బార్‌లకు ప్రభుత్వం మళ్లీ దరఖాస్తుకు గడువు ఇచ్చే అవకాశం ఉంది.

Updated Date - Aug 31 , 2025 | 12:57 AM