బార్‌మంటున్నారు!
ABN , Publish Date - Aug 25 , 2025 | 12:34 AM
రండి బాబు.. రండి.. దరఖాస్తు చేయండి.. మంచి తరుణం మించిన రాదు..అంటూ గ తంలో ప్రైవేటు మద్యం షాపులకు దర ఖాస్తు చేసిన వాళ్లందరికీ ఎక్సయిజ్ అధికా రులు వేలల్లో మెసేజ్‌లు పంపుతున్నారు.
నష్టపోతామని వెనుకంజ
ఇక మిగిలింది రెండు రోజులే
46 బార్లకు 11 ఎన్‌రోల్‌మెంట్లు
దరఖాస్తులకు ఎక్సయిజ్ శాఖ పట్టు
మద్యం దరఖాస్తుదారులకు మెసేజ్‌లు
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
రండి బాబు.. రండి.. దరఖాస్తు చేయండి.. మంచి తరుణం మించిన రాదు..అంటూ గ తంలో ప్రైవేటు మద్యం షాపులకు దర ఖాస్తు చేసిన వాళ్లందరికీ ఎక్సయిజ్ అధికా రులు వేలల్లో మెసేజ్‌లు పంపుతున్నారు. దాబాల వద్దకు వెళ్లి దరఖాస్తు చేయమని వేడుకుంటున్నారు. అయితే కొత్త బార్ పాల సీకి సంబంధించి వ్యాపారులు ముఖం చా టేస్తున్నారు.. ఎక్సైజ్ అధికా రులు మాత్రం దరఖాస్తులు పెరిగేలా చర్యలు చేపడుతున్నా రు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 46 బార్‌లకు నోటి ఫికేషన్ విడుదల చేయగా ఇప్పటి వరకూ కేవలం 11 ఎన్‌రోల్‌మెంట్లు మాత్రమే జరిగాయి.అయినా ఒక్కో బార్‌కి 10 దరఖాస్తులు వస్తాయని ఎక్సయిజ్ అధికారు లు ధీమాగా ఉన్నారు. ఈ నెల 26 (మంగళ వారం) దరఖాస్తు గడువు ముగుస్తుంది. ఇంకా మిగి లింది రెండు రోజులే..అయినా ఎన్‌రోల్‌మెంట్ చూస్తేనే నీరసంగా ఉంది. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 1 నుంచి బార్‌లు ఉంటాయా.. అనే సందిగ్ధం ఫుల్‌గా ఉంది.
బార్లు ఫుల్.. ఎన్‌రోల్‌మెంట్ నిల్
కొత్త బార్‌లకు సంబంధించి ఎన్‌రోల్ మెంట్ నీరసంగా నడుస్తోంది. బార్‌ల లాట రీలో పాల్గొనాలంటే తొలుతగా ఉచితంగా ఎన్‌రోల్‌మెంట్ చేసుకోవాలి. తర్వాత ప్రాసె సింగ్ ఫీజు రూ.10 వేలు చెల్లిస్తే ప్రక్రియ మొదలవుతుంది. అనంతరం రూ.5 లక్షలు దరఖాస్తు ఫీజు చెల్లించిన వారికి లాటరీలో పాల్గొనే అవకాశం దక్కుతుంది. అయితే ఉచితమైనప్పటికీ ఎన్‌రోల్‌మెంట్ అత్యంత నీరసంగానే సాగుతోంది. ఇంకా 2 రోజలే సమయం ఉన్నా కనీసం ఒక్క దరఖాస్తు సమర్పించలేదు.ఈ నెల 23న సాయంత్రం సమయానికి డా.బీఆర్ ఆంబేడ్కర్ కోన సీమ జిల్లాకు 9 బార్‌లు కేటాయించగా ఎన్‌రోల్ మెంట్లు 4 జరిగాయి. ఇద్దరు మాత్రమే రిజి స్ట్రేషన్ ఫీజు చెల్లించారు.తూర్పు గోదావరి జిల్లాలో 22 షాపులకు మూడు ఎన్‌రోల్ మెంట్లు జరగ్గా రిజిస్ర్టేషన్ ఫీజులు చెల్లించ లేదు. కాకినాడ జిల్లాకు సంబంధించి 15 బార్‌లకు ఐదుగురు మాత్రమే రిజిస్టరు అయ్యారు. ఒక్కో షాపునకు రూ.5.10 లక్షల చొప్పున దరఖాస్తు ఫీజును చెల్లించి 4 దర ఖాస్తులు సమర్పించాలని తొలుత ప్రభుత్వం నిబంధన విధిం చినా వ్యాపారుల విన్నపాన్ని పరిగణనలోకి తీసుకొని దానిని సడలించింది. లాటరీలో షాపు దక్కించుకొన్న దరఖాస్తు మినహా మిగతా వారికి ఆ సొమ్ములు తిరిగి చ్చేస్తామని ఎక్సైజ్ కమిషనర్ ప్రకటించారు. అయినా ఎన్‌రోల్‌మెంట్ మాత్రం నీరసంగానే సాగుతోంది. ఎక్సయిజ్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ శనివారం జిల్లాకు రావడంతో ఆయనతో సమావేశమై ఇబ్బందులను వివరించవచ్చని బార్ వ్యాపారులు ఆశించినా ఫలించలేదు.
ఇవీ వ్యాపారుల లెక్కలు
రాజమహేద్రరవరంలో ఒక బార్‌కు దర ఖాస్తు చేయాలంటే ఖర్చు ఇలా ఉంటుం దని వ్యాపారులు లెక్కలు వేసుకుంటు న్నా రు..ఒక్కో షాపునకు 4 దరఖాస్తులు తప్ప నిసరి.. మూడు దరఖాస్తులు వచ్చినా లాట రీ ఉండదు. ఆ లెక్కన సిండికేట్‌గా 4 షాపు లకు దరఖాస్తు చేయాలి.అంటే ఫీజు రూ.20.40 లక్షలు, లైసెన్స్ రుసుం ఏడాదికి రూ.55 లక్షలు, ఇష్యూ ప్రైస్‌పై 15 శాతం అదనంగా అదనపు రిటైల్ ఎక్సయిజ్ టాక్స్ (ఏఆర్‌ఈటీ) సుమారు రూ.54 లక్షలు, నెల కు బార్ అద్దె రూ.1.25 లక్షలు, కరెంటు బిల్లు రూ.30 వేలు, రవాణా రూ.30 వేలు, జీతాలు రూ.1.50 లక్షలు, సివిల్ పోలీ సు లకు నెలకు రూ.15 వేలు, ఎక్సయిజ్ వాళ్లకు రూ.50 వేలు..ఇలా మొత్తం కలిపి సుమారు రూ.1.80 కోట్లు ఏడాదికి వెచ్చించాల్సి ఉం టుందని వ్యాపారులు లెక్కలు వేసి చూపి స్తున్నారు. ఇంత ఖర్చు చేసి తాము నష్టపో కుండా ఉండాలంటే రోజుకు కనీస అమ్మకం రూ.3 లక్షలు ఉండాలని, అలా ఉండాలంటే క్వార్టరుపై కనీసం రూ.50 అదనంగా అమ్మి నా కష్టమేనని, ప్రైవేటు మద్యం షాపులకు పర్మిట్ రూమ్‌లు ఉండగా అంత సొమ్ము అదనంగా చెల్లించి బార్‌లకు ఎవరు వస్తా రని అంటున్నారు. పక్క రాష్ట్ర మైన తెలంగా ణలో దరఖాస్తు ఫీజు రూ.1 లక్ష మాత్ర మే నని ఉదాహరణ చూపెడుతున్నారు.
నిబంధనలు మార్చాలి..
బార్ పాలసీలో మార్పులు చేయకపోతే నెలకు కనీసం రూ.10 లక్షల వరకూ నష్టం భరించాల్సి ఉంటుందని వ్యాపారులు చెబుతు న్నారు.పక్క రాష్ట్రంలోని హైదరాబాద్, సికిం ద్రాబాద్ మెట్రో సిటీల్లో సైతం రూ.40 లక్షల వార్షిక ఫీజు ఉండగా 22 శాతం మార్జిన్ సదు పాయం ఉంది.అయినప్పటికీ అక్కడా నష్టాలు భరిస్తున్నారు.బార్ ఏర్పాటుకు ఫర్నిచర్, సామ గ్రి వంటి వాటికి లక్షల్లో పెట్టుబడి పెట్టా లి. అందువల్ల వార్షిక లైసెన్సు ఫీజులో ఎంతో కొంత పెంపుదల చేసి అప్పటికే ఉన్న బార్ లను కొనసాగిస్తారు.ఇదే విధానం తెలంగాణ లో ఉన్నా నష్టాలు వస్తున్నాయి. ఏపీలో ఇప్పు డు మూడేళ్లలో లైసెన్స్ అంటున్నారు. తర్వాత మళ్లీ లాటరీ అంటే.. తమకు షాపు రాకపోతే లక్షల రూపాయల సామగ్రి, ఫర్నీచర్ ఏం చేసుకోవాలని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. ఆ నిబంధన మార్చాల ని డిమాండ్ చేస్తున్నారు.