Share News

దారి..చూపారు!

ABN , Publish Date - Nov 09 , 2025 | 12:44 AM

కాకినాడ-పుదుచ్చేరి బకింగ్‌హం కాలువకు ఎట్టకేలకు మంచి రోజులొచ్చాయి.

దారి..చూపారు!

కాకినాడ టూ పుదుచ్చేరి

బకింగ్‌హం కెనాల్‌కు మంచిరోజులు

పురాతన జలరవాణాకు పచ్చజెండా

ఐడబ్ల్యూఏఐతో సర్కారు ఒప్పందం

రూ.80 కోట్లతో కాలువ అభివృద్ధి

ఐదేళ్ల పాటు ఎంవోయూ అమలు

(కాకినాడ,ఆంధ్రజ్యోతి)

కాకినాడ-పుదుచ్చేరి బకింగ్‌హం కాలువకు ఎట్టకేలకు మంచి రోజులొచ్చాయి. ఈ మార్గంలో గోదావరి,కృష్ణా నదుల మీదుగా సరుకు రవాణా, పర్యాటక అభివృద్ధికి వేగంగా అడుగులు పడు తున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత మళ్లీ ఈ కాలువకు పూర్వ వైభవం తెచ్చే దిశగా రంగం సిద్ధమవుతోంది.ఈ మేరకు కాలువ అభి వృద్ధికి ఇన్నేళ్లకు ఇన్‌లాండ్‌ వాటర్‌ వేస్‌ అథా రిటీ ఆఫ్‌ ఇండియా (ఐడబ్ల్యూఏఐ) రాష్ట్ర ప్రభు త్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవల ముంబైలో జరిగిన మారిటైం సదస్సులో ఎంవో యూ కుదిరింది. ఐదేళ్ల పాటు అమల్లో ఉండ నున్న ఒప్పందం మేరకు ఈ రెండూ కలిసి బ కింగ్‌హం కెనాల్‌ అభివృద్ధి, జల రవాణా మార్గాల అన్వేషణ, కాలువల డ్రెడ్జింగ్‌, రివర్‌ క్రూయిజ్‌ పర్యాటకాన్ని ఉమ్మడిగా అభివృద్ధి చేయనున్నాయి. తొలుత రూ.80 కోట్లతో కాలువ అభివృద్ధికి ఐడబ్ల్యూఏఐ శ్రీకారం చుట్టనుంది.

ఒప్పందాలు ఇలా..

జల రవాణాకు డిమాండ్‌ పెరగడం, కారు చౌక రవాణామార్గం కావడంతో కాలువను అభి వృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణ యిం చారు.ఈ మేరకు ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కాలువలను అభివృద్ధి చేసే ఇన్‌లాండ్‌ వాటర్‌ వేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఐడబ్ల్యూఏఐ) తోను చర్చలు జరిపారు.ఈ మేరకు వారం కిందట ముంబైలో జరిగిన మారిటైం సదస్సులో కాలువను రూ.80 కోట్లతో అభివృద్ధి చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నాయి.ఒప్పందం ఐదేళ్ల పాటు అమల్లో ఉంటుంది. నౌకల రాకపోకలకు వీలుగా కాలు వల్లో పూడిక తీయడం, ఓడలు రాకపోకలు సాగించేలా వెస్సల్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌ మెంట్‌ సిస్టం ఏర్పాటు, నావిగేషన్‌ వ్యవస్థ తీర్చిదిద్దడం,కాలువల్లో రివర్‌ క్రూయిజ్‌లు నడిపేలా సహా యపడడం వంటివన్నీ మౌలిక సదుపాయాల రూపంలో తీర్చిదిద్దనుంది. సెకం డ్‌పార్టీ కింద రాష్ట్రప్రభుత్వం తరపున జల రవాణా మార్గాన్ని అభివృద్ధి చేసిన తర్వాత రివర్‌ క్రూయిజ్‌ నౌకలు బెర్తింగ్‌ అవడానికి కావాల్సిన భూముల కేటా యింపు, బకింగ్‌ హం కాలువలో డ్రెడ్జింగ్‌ తర్వాత తవ్వితీసిన భారీ బురద, మట్టిని నిల్వ చేసేందుకు తగిన స్థలాలు, సరుకు రవాణా, పర్యాటక నౌకల రాక పోకలు, వెస్సల్‌ ట్రాఫిక్‌ పర్యవేక్షణ చేపట్టాల్సి ఉంది. ఐదేళ్ల పాటు ఇవన్నీ ఈ రెండు ఒప్పందం ప్రకారం చేయా లని ఎంవోయూలో ప్రస్తావించారు.ఈ నేపథ్యం లో ఇన్నేళ్ల తర్వాత బకింగ్‌ హం కెనాల్‌ అభి వృద్ధికి మార్గం సుగ మం కానుంది.

నాడు ఎంతో ప్రసిద్ధి

కాకినాడ-పుదుచ్చేరి బకింగ్‌హం కాలువ బ్రి టిష్‌ కాలంలో ఎంతో ప్రఖ్యాతి చెందింది. కాకి నాడ నుంచి మొదలయ్యే ఈ కాలువ గోదా వ రి, కృష్ణా మీదుగా తమిళనాడులోని విల్లుపు రం వరకు 796 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. మన రాష్ట్ర పరిధిలో 257 కి.మీ. వరకు ఉంది. కాకినాడ నుంచి గోదావరి మీదుగా తమిళనాడు వరకు అప్పట్లో జల రవాణా కింద సరుకులు భారీగా ఎగుమతి,దిగుమతి అయ్యే వి. అయితే క్రమేపీ కాలువ పూర్తిగా పూడుకు పోవ డంతో ప్రభుత్వాలు గాలికొదిలేశాయి.

జలదారులివే..

కాకినాడ నుంచి రాజమహేంద్ర వరం, రాజమహేంద్రవరం-విజయవాడ, రాజమహేంద్ర వరం నుంచి భద్రాచలం, అంతర్వేది నుంచి నరసాపురం, నర సాపురం నుంచి సఖినేటిపల్లి, కోటిపల్లి- ముక్తేశ్వరం, నిడదవోలు నుంచి ఏలూ రు వరకు జలరవాణా రూట్లను గుర్తించారు. ఈ మార్గాల్లో పలు పరిశ్రమలకు కార్గో రవా ణాతో పాటు పర్యాటక బోట్లను నడిపేందుకు అనుమతులిస్తూ ఆసక్తి కలిగిన సంస్థలను ఆహ్వానించారు. కాకినాడ నుంచి విజయవాడ, రాజమ హేంద్రవరం నుంచి భద్రాచలంతో పాటు పలు ఇతర మా ర్గాల్లోను భారీ రివర్‌ క్రూయిజ్‌లను నడపవచ్చని ప్రతి పాదించారు. ఇటీవల ఎంపిక చేసిన జల రవాణా మార్గాల్లో వ్యాపారాలు చేయడానికి కొన్ని కంపెనీలు ముందుకు వచ్చాయి.కింగ్‌హం కాలువ అభివృద్ధి పనులు పట్టాలెక్కిన తర్వాత వీటితో చర్చలు జరిపి సరకు, పర్యాటక రవాణాకు సంబంధించి పూర్తిస్థాయి కార్యాచరణ చేపట్టనున్నారు.

ఎన్ని అవకాశాలో..

బకింగ్‌హం కాలువ ద్వారా సరుకు రవా ణాకు మళ్లీ ఊపిరిలూదాలని 2016లో అప్పటి టీడీపీ ప్రభుత్వం భావించింది.ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో ప్రతిపాదనలన్నీ మూల నపడిపోయాయి.మళ్లీ ఇప్పుడు సీఎం చంద్ర బాబు బకింగ్‌హం కాలువ అభివృద్ధికి ఇన్‌ లాండ్‌ వాటర్‌ వేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ముందుకు వచ్చేలా ఒప్పించారు. ఒప్పందానికి ముందే ప్రభుత్వం తరపున పది జల రవాణా మార్గాలను ఎంపిక చేసి అభివృద్ధి చేసే లా ప్రైవేటు సంస్థలను టెండర్ల ద్వారా ఆహ్వానిం చింది.ఈ మార్గాల్లో డ్రెడ్జింగ్‌ అనంతరం రవాణా కార్యకలాపాలు ప్రైవేటు సంస్థలు సాగించేలా నిబంధనలు రూపొందించారు.

Updated Date - Nov 09 , 2025 | 12:44 AM