Share News

కల్తీ టిఫిన్‌ తిని 20 మందికి అస్వస్థత

ABN , Publish Date - Oct 18 , 2025 | 12:22 AM

అంబాజీపేట, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అం బాజీపేట మండలం మాచవరం గ్రామానికి చెందిన 20 మంది కల్తీ అల్పాహారం తిని అస్వస్థతకు గురయ్యారు. బుధవారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం ది. వీరంతా అంబాజీపేటలో ఉన్న హోటల్‌లో బుధవారం ఉదయం టిఫిన్‌ తిని అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్‌పాయిజన్‌ కావడంతో అం బాజీపేట, అమలాపురంలోని పలు ప్రవేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందు

కల్తీ టిఫిన్‌ తిని 20 మందికి అస్వస్థత
అంబాజీపేటలో చికిత్స పొందుతున్న బాధితులు

ఆలస్యంగా వెలుగులోకి..

అంబాజీపేట, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అం బాజీపేట మండలం మాచవరం గ్రామానికి చెందిన 20 మంది కల్తీ అల్పాహారం తిని అస్వస్థతకు గురయ్యారు. బుధవారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం ది. వీరంతా అంబాజీపేటలో ఉన్న హోటల్‌లో బుధవారం ఉదయం టిఫిన్‌ తిని అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్‌పాయిజన్‌ కావడంతో అం బాజీపేట, అమలాపురంలోని పలు ప్రవేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మాచవరం గ్రామ పరిధిలోని బెహరవారి అగ్రహా రం, అంబేడ్కర్‌నగర్లకు చెందిన 20 మంది స్థానికంగా ఉన్న ఓ బెల్లం తయారీ కేంద్రం, భవన నిర్మాణ పనుల నిమిత్తం వెళ్లారు. అం బాజీపేటలోని ఓ హోటల్‌ నుంచి బుధవారం ఉదయం తీసుకువచ్చిన టిఫిన్‌ తిని అస్వస్థత కు గురయ్యారు. స్థానిక ఆర్‌ఎంపీల వద్ద చికి త్స తీసుకున్నారు. అయినప్పటికి వీరోచనాలు, వాంతులు తగ్గకపోవడంతో స్థానికంగా ఉన్న ప్రవేట్‌ ఆసుపత్రుల్లో చేరారు. ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్న వారిని పి.గన్నవరం సీఐ రుద్రరాజు భీమరాజు, ఎస్‌ఐలు చిరంజీవి, శివకృష్ణ పరామర్శించి వివరాలు సేకరించారు.

Updated Date - Oct 18 , 2025 | 12:22 AM