బేబీ కిట్టు.. అందేటట్టు!
ABN , Publish Date - Jul 06 , 2025 | 01:02 AM
నాడు టీడీపీ ప్రభుత్వం అందజేసిన పలు ప్రజాసంక్షేమ పథకాలను గత వైసీపీ ప్రభుత్వం రద్దుచేసింది. దీంతో చాలా మందికి ఆ పథకాలు దూరమయ్యాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. మళ్లీ తిరిగి వాటిని ప్రజలందరికీ చేర్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది.

పాత పథకం పునరుద్ధరణ
ప్రభుత్వాసుపత్రుల్లో అందజేత
2021 నుంచి నిలిపేసిన వైసీపీ
నెలాఖరు నుంచి అమలు యోచన
(కాకినాడ - ఆంధ్రజ్యోతి)
నాడు టీడీపీ ప్రభుత్వం అందజేసిన పలు ప్రజాసంక్షేమ పథకాలను గత వైసీపీ ప్రభుత్వం రద్దుచేసింది. దీంతో చాలా మందికి ఆ పథకాలు దూరమయ్యాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. మళ్లీ తిరిగి వాటిని ప్రజలందరికీ చేర్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ప్రభుత్వ వైద్యశాలల్లో జన్మించిన చిన్నారులకు రక్షణ కల్పించేందుకు బేబీ కిట్లను పంపిణీ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. 2016లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. అధికారంలో ఉన్నంతకాలం పథకాన్ని అమలుచేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ పథకం పేరు మార్చింది. కిట్లను పూర్తిగా అటకెక్కించిం ది. 2021 నుంచి పూర్తిగా నిలిపివేసింది. దీంతో పేద ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. బయట కొనుగోలు చేసుకునే ఆర్థిక స్తోమత లేక అవస్థలుపడ్డారు. గతంలో తాము అధికారంలో ఉండగా అమలు చేసి న ఈ పథకాన్ని మళ్లీ అందుబాటులోకి తేవాలని కూటమి ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. దీనిలో భాగంగానే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు చేసుకునే బాలింతలకు ఈ కిట్లు అందజేయనుంది.
ఈ నెలాఖరు నుంచి కిట్లు
జిల్లాల్లోని డీఎంహెచ్‌వో, డీసీహెచ్‌ఎస్, జీజీహెచ్‌లకు రెండేళ్లపాటు రేట్ కాంట్రా క్టు పద్ధతిలో కిట్లు సరఫరా చేసేలా టెం డర్లు పిలిచారు. ఆ బాధ్యతను ఆంధ్ర ప్రదేశ్ వైద్యసేవలు, మౌలిక వసతుల అభి వృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ)కు ప్రభు త్వం అప్పగించింది. అర్హత కలిగిన తయారీదారులు, అధికారిక డిస్ట్రిబ్యూటర్లు ఈ ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో బిడ్లు సమర్పించాలని పేర్కొంది. ఈ నెలాఖరు నుంచి ఈ బేబీ కిట్లు పంపిణీ జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఏడాదికి సుమారు 50 వేల వరకు ప్రసవాలు జరుగుతున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రసవాలు జరిగితే కుటుంబ సభ్యులు కిట్లను బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన దుస్థితి. దీని ఖరీదు రూ.1500 నుంచి రూ.2 వేల వరకు ఉంటోంది. నిరుపేదలైన వారు కొనుగోలు చేసే పరిస్థితి లేక అలాగే ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ఈ ప్రభావం చిన్నారుల ఆరోగ్యంపై పడుతుంది. వివిధ రకాల రుగ్మతలతో బాధపడే అవకాశం ఉంది. అలాంటి వారికి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఎంతో మేలు కలుగుతోంది.