Share News

పెద్దాపురం సిల్క్‌కు జాతీయ స్థాయిలో ఖ్యాతి

ABN , Publish Date - Jul 15 , 2025 | 12:35 AM

పెద్దాపురం, జూలై 14 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టు సిల్క్‌కు జాతీయస్థాయి గుర్తింపు లభించింది. ఒకే జిల్లా ఒకే ఉత్పత్తి (ఓడీఓపీ) పథకం కింద కేంద్రం ఈ అ వార్డును అందించింది. తమ నైపుణ్యానికి తగిన గుర్తింపు కోసం ఎంతోమంది చేనేత కార్మిక కుటుంబాలు ఎదురుచూశాయి. వారి ఆకాం

పెద్దాపురం సిల్క్‌కు జాతీయ స్థాయిలో ఖ్యాతి
పెద్దాపురం పట్టుచీరలు

వన్‌ డిస్ట్రిక్ట్‌ వన్‌ ప్రొడక్ట్‌ పథకం

కింద కేంద్రం నుంచి అవార్డు

ఇక దేశవ్యాప్తంగా ప్రాచుర్యం

మరింత ప్రోత్సాహం

మెరుగుపడనున్న చేనేత కుటుంబాల జీవన స్థితిగతులు

పెద్దాపురం, జూలై 14 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టు సిల్క్‌కు జాతీయస్థాయి గుర్తింపు లభించింది. ఒకే జిల్లా ఒకే ఉత్పత్తి (ఓడీఓపీ) పథకం కింద కేంద్రం ఈ అ వార్డును అందించింది. తమ నైపుణ్యానికి తగిన గుర్తింపు కోసం ఎంతోమంది చేనేత కార్మిక కుటుంబాలు ఎదురుచూశాయి. వారి ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేర్చింది. జాతీయస్థాయి అవా ర్డును జిల్లా కలెక్టర్‌ షాన్‌మోహన్‌ ఢిల్లీలో కేంద్ర మంత్రి చేతుల మీదుగా అందుకున్నారు.

డిసెంబరులో కేంద్ర బృందం పర్యటన..

గతేడాది డిసెంబరులో కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో పర్య టించి పరిశీలన చేసింది. ఈ సందర్భంగా ఇక్కడ చేనేత వస్త్రాలను ప్రత్యేకత, నాణ్యతను వారు పరిశీలించారు. వీటికి సంబంఽ దించిన వివరాలను జిల్లా జౌళీశాఖ ఏడీ బృంద సభ్యులకు వివరించారు. పెద్దాపురం పట్టు సిల్క్‌తో తయారు చేసిన చీర లు, ధోతీలు, పంచెలు, ఉత్పత్తులు, అమ్మకాలు, వారి జీవన స్థితి గతులపై కేంద్ర బృందానికి నివేదికలు అందించారు. పెద్దాపురం సిల్స్‌ వస్త్రాలు నేయడానికి ప్రత్యేక నైపుణ్యం ఉండాలి. ధోతీలకు అంచులు పలు విధాలుగా నేయాల్సి ఉంటుంది. ఎంతో నైపు ణ్యం ఉంటే కానీ ఇటువంటి వస్త్రాలను తయారుచేయడం కుదరని పని.

చారిత్రక ప్రాధాన్యం...

సంప్రదాయ మగ్గాలపై నేసిన ధోతీలు, పంచెలు, చీరలకు మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంది. తాజాగా కేంద్రం జాతీయ అవార్డు ప్రకటించడంతో పెద్దాపురం సిల్క్‌ దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. చేనేతల కష్టం సుమారు నాలుగు దశాబ్దాల తర్వాత లభించింది. పెద్దాపురం సిల్క్‌కు చారిత్రక ప్రాధాన్యం ఉంది. స్వాతంత్ర పోరాటంలో ఈ వస్త్రాలు ప్రముఖ పాత్రను పోషించాయని స్థానికులు చెబుతారు. మహాత్మాగాంధీ పిలుపు తో ప్రజలు విదేశీ వస్త్ర బహిష్కరణ చేసి స్థానిక నేత కార్మికులు నేసిన వస్త్రాలను ధరించి ఉద్యమంలో పాల్గొన్నారు. కొత్త ఆవిష్కరణలకు పెద్దాపురం చేనేత కార్మికులు సిద్దహస్తులు. జాతి పిత మహాత్మా గాంధీ 1929, 1933లో రెండుసార్లు పెద్దాపురంలో పర్యటించారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే పట్టు వస్త్రాలు నాణ్యతను చూసిన గాంధీజీ చాలా ముగ్ధులై దానికి స్వదేశీ పట్టు అనే బిరుదును సైతం ఇచ్చారు.

18వ దశకంలో వీవర్స్‌ సొసైటీ ప్రారంభం...

పెద్దాపురం వీవర్స్‌ సొసైటీ 18వ దశకంలో ప్రారంభంలో బ్రిటీష్‌వారు స్థాపించిన సమయంలో ముప్పన సోమరాజు ముప్పన వీర్రాజు సోదరులు మల్బరీ సిల్స్‌ నూలు ఉత్పత్తిని చేయడం ప్రారంభించారు. దీనిని సిల్క్‌ ట్విస్టింగ్‌ అని పిలి చేవారు. పెద్దాపురంలో నేత కార్మికులకు ధోతీలను నేయడానికి పంపిణీ చేశారు. మల్బరీ పట్టు నూతుల వెంట్రుకల తీగలా మొత్తగా ఉంటుంది. ఇది నేయడం కష్టంతో కూడుకున్న పని. నేత కార్మికులు వస్త్రం మృదువైన ఆకృతిని పొందడానికి సుమారు ఐదు నుంచి ఆరు సంవత్సరాలు పట్టింది. పెద్దాపురంలో రెండు సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలు నేత కార్మికులను సిల్క్‌ ధోతీలు, షర్టింగ్‌, చీరలు నేయడంలోనే ఉంటారు. పెద్దాపురం చేనేత సొసైటీ సుమారు మూడు నుంచి నాలుగు కోట్ల వార్షిక టర్నోవర్‌తో కొనసాగుతుంది. 1996లోనే పెద్దాపురం సిల్క్‌ కుప్పడం ఉత్పత్తి ప్రారంభమయ్యింది. అలాగే ధోతీలు బాగా ప్రాచుర్యం పొందాయి. 1977లో సరిహద్దు భాగం నుంచి నూలును తిప్పికొట్టడం, తిప్పడం సులభతరం చేయడం ద్వారా పురోగతిని సాధించాయి. పెద్దాపురం సిల్క్‌ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించాయి.

అప్పట్లో సంచలనం..

చౌడువాడ ఎస్టేట్‌ జమిందార్లు, ముప్పన సోదరులు 1913లో పెద్దాపురంలో శ్రీలక్ష్మీ సిల్క్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ వర్క్స్‌ పేరుతో సిల్క్‌ ఫ్యాక్టరీని స్థాపించారు. అప్పట్లో కొన్ని పరికరాలు జర్మనీ నుంచి దిగుమతి చేసుకుని డీజీ సెట్ల ఉత్పత్తి చేయబడిన వి ద్యుత్తుతో ఫ్యాక్టరీని నడిపేవారు. అప్పట్లో ఇది ఒక సంచలనం. పెద్దాపురం అప్పటికి ఇంకా విద్యుదీకరణ జరగనేలేదు. సుమారు వెయ్యి మంది కార్మికులు ఈ సిల్క్‌ ఫ్యాక్టరీలో పనిచేసేవారు. కాకినాడ సముద్రం నుంచి చైనా, జపాన్‌ నుంచి ముడి సరుకుని దిగు మతి చేసుకునేవారు. తయారు చేసిన వస్త్రాలను సిలోన్‌, బర్మా, సిగపూర్‌, ఇంగ్లాండ్‌, తదిర దేశాలకు ఎగుమతి చేసేవారు.

చాలా గర్వించదగ్గ విషయం

పెద్దాపురం సిల్క్‌కు జాతీయస్థాయిలో గుర్తింపు లభించడం చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా గర్వించదగ్గ విషయం. వన్‌ డిస్ట్రిక్ట్‌ వన్‌ ప్రొడక్ట్‌ పథకంలో భాగంగా అవార్డు లభించింది. జాతీయ స్థాయిలో పెద్దాపురం సిల్క్‌కు గుర్తింపు రావడం ద్వారా చేనేత కుటుంబాల జీవన ప్రమాణాలు సైతం మెరుగు పడతాయి.

కె.పెద్దిరాజు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌, జిల్లా చేనేత, జౌళిశాఖ, కాకినాడ

Updated Date - Jul 15 , 2025 | 12:35 AM