‘తూర్పు’ పోలీసులకు రాష్ట్రస్థాయి పురస్కారం
ABN , Publish Date - Dec 20 , 2025 | 12:43 AM
రాజమహేంద్రవరం/కొవ్వూరు, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): కేసు దర్యాప్తులో ప్రతిభ చూపిన పోలీసులకు రాష్ట్రస్థాయిలో ఇచ్చే (అవార్డ్ ఫర్ బెస్ట్ ఇన్ క్రైం డిటెక్షన్) ఏబీసీడీ అవార్డు తూర్పు గోదావరి జిల్లా పోలీసులకు దక్కింది. ఏడాదిని 4 భాగాలుగా చేసి 3 నెలలకు పరిగణనలోకి తీసు కుని ఈ అవార్డును ఇస్తారు. కొవ్వూ
కేసు దర్యాప్తులో ప్రతిభకు ఏబీసీడీ అవార్డు
డీజీపీ నుంచి అందుకున్న ఎస్పీ
రాజమహేంద్రవరం/కొవ్వూరు, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): కేసు దర్యాప్తులో ప్రతిభ చూపిన పోలీసులకు రాష్ట్రస్థాయిలో ఇచ్చే (అవార్డ్ ఫర్ బెస్ట్ ఇన్ క్రైం డిటెక్షన్) ఏబీసీడీ అవార్డు తూర్పు గోదావరి జిల్లా పోలీసులకు దక్కింది. ఏడాదిని 4 భాగాలుగా చేసి 3 నెలలకు పరిగణనలోకి తీసు కుని ఈ అవార్డును ఇస్తారు. కొవ్వూరు టౌన్ పో లీస్ స్టేషన్లో నమోదైన ఓ కేసును చాకచక్యంగా ఛేదించినందుకు ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించి అవార్డు సాధించా రు. ఈ అవార్డును డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా నుంచి జిల్లా పోలీసుల తరపున ఎస్పీ నరసింహ కిషోర్ స్వీకరించారు. అవార్డు సాధించిన కేసును దర్యాప్తు చేసినవారిలో కొవ్వూరు టౌన్ సీఐ పి. విశ్వం, రూరల్ సీఐ కె.విజయ్ బాబు, కొవ్వూరు టౌన్ ఎస్‌ఐలు పి.రవీంద్రబాబు, కె.జగన్మోహన రావు, కె.శ్రీహరిరావు, సైబర్ క్రైం ఎస్‌ఐ ఎన్.అయ్యప్ప రెడ్డి, కొవ్వూరు టౌన్ పీఎస్ ఏఎస్ ఐ ఎస్‌ఎన్ శ్రీనివాస్, హెచ్‌సీలు ఆర్.సాంబ మూర్తి, ఎంవీ సత్యనారాయణ, తాళ్లపూడి పీఎస్ కానిస్టేబుల్ జి.అనీల్‌కుమార్, కొవ్వూరు టౌన్ పీ ఎస్ కానిస్టేబుల్స్ అఫ్సారీ బేగ్, ఆర్‌కే సత్యనారా యణ, కె.జయరాం, ఎం.సూరిబాబు, జి.ఉమా మహేశ్వరరావు, డి.రామకృష్ణారావు, డి.రామకృష్ణ, ఎస్.గణేష్ ఉన్నారు.