ఆటో బోల్తా .. ఏడుగురు విద్యార్థులకు గాయాలు
ABN , Publish Date - Aug 05 , 2025 | 12:42 AM
తునిరూరల్, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా తుని మండలం హంసవరం గ్రామ సమీపంలో సోమవారం ఉదయం విద్యార్థులతో వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో బోల్తా కొట్టింది. దీంతో ఏడుగురికి గాయా లయ్యాయి. రోజు మాదిరిగానే తుని మండలం మరువాడ గ్రామం నుంచి విద్యార్థులు ఆటో ఎక్కి హంసవరంలో గల ఏపీ మోడల్ స్కూల్‌కి వెళ్తుండగా కారు ఢీకొనడంతో ఆటో అదుపుతప్పి పంటపొలాల్లోకి బోల్తా కొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు విద్యార్థులకు గాయాలు కాగా ఆటో డ్రైవర్ తీవ్ర గాయాలపాలయ్యాడు. విద్యార్థులు చెల్లాచెదురుగా పడిపోవడంతో తల, కాళ్ల కు గాయాలయ్యాయి. కే
హంసవరం ఏపీ మోడల్ స్కూల్‌కి వెళ్తుండగా ఢీకొన్న కారు
తుని ఏరియా ఆసుపత్రికి తరలింపు
తునిరూరల్, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా తుని మండలం హంసవరం గ్రామ సమీపంలో సోమవారం ఉదయం విద్యార్థులతో వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో బోల్తా కొట్టింది. దీంతో ఏడుగురికి గాయా లయ్యాయి. రోజు మాదిరిగానే తుని మండలం మరువాడ గ్రామం నుంచి విద్యార్థులు ఆటో ఎక్కి హంసవరంలో గల ఏపీ మోడల్ స్కూల్‌కి వెళ్తుండగా కారు ఢీకొనడంతో ఆటో అదుపుతప్పి పంటపొలాల్లోకి బోల్తా కొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు విద్యార్థులకు గాయాలు కాగా ఆటో డ్రైవర్ తీవ్ర గాయాలపాలయ్యాడు. విద్యార్థులు చెల్లాచెదురుగా పడిపోవడంతో తల, కాళ్ల కు గాయాలయ్యాయి. కేకలు వేయడంతో ఆ ప్రాంతంలోని రైతులు, పాఠశాల ఉపాధ్యాయు లు హుటాహుటిన చేరుకుని విద్యార్థులను తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాయాలపాలైన విద్యార్థులు అప్పన రావణ్‌కుమార్, కామిరెడ్డి కృపానంద, కామిరెడ్డి సాత్విక్, కిల్లాడి నవీన్‌రాజు, రామ్‌చరణ్, ఉరుకోటి రవి, ఉరుకోటి పవన్, జి.ఈశ్వరికి వైద్యులు పరీక్షలు చేసి చికిత్స అందించారు. ఆటోను ఢీకొన్న కారు ఆగకుండా వెళ్లిపోవడంతో సీసీ పుటేజ్ ఆధారంగా కారును పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ప్రమాదం సమాచారం తెలుసుకున్న విద్యార్థులతల్లిదండ్రులు ఆందోళనతో ఏరియా ఆసుపత్రికి పరుగులు తీశారు. గాయాలతో ఉన్న తమ పిల్లలను చూసి కన్నీరు పెట్టుకున్నారు. ఘటనపై తుని ఎమ్మెల్యే దివ్య ఆరా తీశారు. విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలందించాలని సూచించారు.