Share News

ఆస్తులకు ఆటోమ్యూటేషన్‌

ABN , Publish Date - Jul 30 , 2025 | 12:35 AM

ఆస్తుల మార్పునకు, అవినీతి వ్యవహారాలకు చెక్‌ పెట్టేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముందుగా రాష్ట్రంలోని 17కార్పొరేషన్లలో ఆస్తులకు ఆటోమ్యూటేషన్‌ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ వేగవంతంతోపాటు సమయం ఆదా అవుతుంది.

ఆస్తులకు ఆటోమ్యూటేషన్‌

  • ఆగస్టు 1 నుంచి కార్పొరేషన్‌లో అమలు

  • ఇకపై అవినీతికి, ఆలస్యానికి చెక్‌

  • రిజిస్ట్రేషన్లు పూర్తయిన వెంటనే పేరు మార్పు

  • కాకినాడలో పటిష్టంగా అమలుకు చర్యలు

కార్పొరేషన్‌(కాకినాడ), జూలై 29(ఆంధ్ర జ్యోతి): ఆస్తుల మార్పునకు, అవినీతి వ్యవహారాలకు చెక్‌ పెట్టేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముందుగా రాష్ట్రంలోని 17కార్పొరేషన్లలో ఆస్తులకు ఆటోమ్యూటేషన్‌ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ వేగవంతంతోపాటు సమయం ఆదా అవుతుంది. ఈ విధానం ఇప్పటికే విజయవాడ నగరంలో విజయవంతం కావడంతో అన్ని కార్పొరేషన్లలో ఆగస్టు 1 నుంచి అమల్లోకి తెస్తున్నారు. కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు విస్తృతం చేశారు.

ఇప్పటివరకు ఇలా..

ఆస్తులు కొనుగోలు చేసిన తర్వాత వారి పేర్లపై హక్కులను బదలాయించడం కోసం సబ్‌రిజిసా్ట్రర్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ ముగుస్తుంది. ఆ తర్వాత కార్పొరేషన్‌ కార్యాలయానికి వెళ్లాలి. ఇంటి, కుళాయి పన్ను రశీదుల్లో పేరు మార్పు కోసం మార్కెట్‌లో ఆ ఆస్తి విలువలో ఒకశాతం మ్యూటేషన్‌ ఫీజుగా చలానా చెల్లించి సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. సచివాలయంలో డాక్యుమెంట్లు పొందుపరిచిన తర్వాత ఆర్‌ఐ, ఆర్‌వో లాగిన్లలో ప్రక్రియ పూర్తయి చివరికి కమిషనర్‌ లాగిన్‌కు చేరుతుంది. అందుకోసం రోజుల తరబడి తిరగడంతోపాటు రెవెన్యూ సెక్షన్‌ అధికారులను ప్రసన్నం చేసుకోవాలి. అవసరమైతే వారడిగినంతా చెల్లించుకోవాలి. ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం 14రోజుల్లో ఈ మొత్తం ప్రక్రియ పూర్తికావాల్సి ఉంది. రెవెన్యూ సిబ్బంది ఆశీస్సుల కోసం రోజులు, నెలల తరబడి కూడా తిరగాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఆటోమ్యూటేషన్‌తో ఆ కష్టాలు తీరనున్నాయి. సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయంలో ఆస్తి బదలాయింపుతోనే అన్ని ప్రక్రియలు ఆటోమేటిక్‌గా పూర్తవుతాయి.

నూతన విధానంలో ఇలా..

ఆటోమ్యుటేషన్‌ అందుబాటులోకివస్తే ఆస్తి కొనుగోలు చేసిన వ్యక్తి మ్యుటేషన్‌కోసం కార్పొరేషన్‌ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్‌ సమయంలోనే ఆస్తి విలువ లో ఒకశాతం చలానా చెల్లిస్తే చాలు సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయంలోనే ఆ ప్రక్రియ పూర్తవుతుంది. రిజిసే్ట్రషన్‌ ఆన్‌లైన్‌లో జరగ్గానే ఆటో మేటిక్‌గా ఆ డాక్యుమెంట్లు నేరుగా కమిషనర్‌ కు లాగిన్‌కు చేరుతాయి. ఆయన పరిశీలించి ఓకే చేసిన వెంటనే ఆస్తిని కొనుగోలు చేసిన యజమాని పేరుపైనే ఆన్‌లైన్‌లో మారిపోతుంది. ఇందుకు సంబంధించి ఆయా సబ్‌రిజిసా్ట్రర్‌ కార్యాలయాల్లో సాఫ్ట్‌వేర్‌ ఇన్‌స్టాలేషన్‌ జరగాల్సి ఉంది. అందుకోసం ప్రభుత్వశాఖ నుంచి సబ్‌రిజిసా్ట్రర్లు, కార్పొరేషన్‌ అధికారులకు మౌఖిక ఆదేశాలు అందాయి. ఈ మేరకు కాకినాడ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ఆస్తులకు ఆటో మ్యుటేషన్‌పై సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇచ్చారు.

కార్పొరేషన్‌కి ఆదాయం

ఇప్పటివరకు కార్పొరేషన్‌ పరిధిలో ఖాళీ స్థలాలు రిజిస్ట్రేషన్‌ అయినప్పటికీ స్థల య జమానులు పన్ను వేయించుకునే వారు కా దు. ఈఆటోమ్యుటేషన్‌ ద్వారా వెంటనే కొనుగోలుదారుల పేరు మీద డాక్యుమెంటేషన్‌ అవుతుంది కాబట్టి వారిని గుర్తించి పన్ను లు వేయించడం ద్వారా కార్పొరేషన్‌లకు ఆ దాయం సమకూరుతుంది. సంబంధిత ఆస్తి పై వాటర్‌ చార్జెస్‌ కానీ ఆస్తి పన్ను లు కానీ ఏమన్నా వెంటనే కట్టుకున్న తర్వాత మా త్రమే రిజిస్ట్రేషన్‌ తర్వాత ఈ ఆటోమ్యూటేషన్‌ ప్రక్రియ పూర్తవుతుంది. ఈఅవకాశాన్ని నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలి.

-కోన శ్రీనివాస్‌, డిప్యూటీ కమిషనర్‌ నగరపాలక సంస్థ, కాకినాడ

Updated Date - Jul 30 , 2025 | 12:35 AM