ఆటోడ్రైవర్ల సేవలో కూటమి ప్రభుత్వం
ABN , Publish Date - Oct 05 , 2025 | 12:36 AM
ఆటోడ్రైవర్ల జీవితాలను మెరుగు పరిచే విధంగా ప్రభుత్వం ఆటోడ్రైవర్ల సేవలో పథకం ప్రారంభించడం చారిత్రాత్మక నిర్ణయమ ని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. ఆటోడ్రైవర్ల సేవలో.. పథకంలో భాగంగా ప్రభు త్వం ఆటోడ్రైవర్ల ఖాతాలకు శనివారం రూ.15 వేలు చొప్పున జమచేసింది.
ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి
ఆటోడ్రైవర్ల సేవలో.. పథకం
ఆటోడ్రైవర్ల బ్యాంకు ఖాతాలకు ప్రభుత్వం రూ.15 వేలు జమ
రాజమహేంద్రవరం రూరల్, అక్టోబరు 4(ఆం ధ్రజ్యోతి): ఆటోడ్రైవర్ల జీవితాలను మెరుగు పరిచే విధంగా ప్రభుత్వం ఆటోడ్రైవర్ల సేవలో పథకం ప్రారంభించడం చారిత్రాత్మక నిర్ణయమ ని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. ఆటోడ్రైవర్ల సేవలో.. పథకంలో భాగంగా ప్రభు త్వం ఆటోడ్రైవర్ల ఖాతాలకు శనివారం రూ.15 వేలు చొప్పున జమచేసింది. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం మున్సిపల్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ఆటోడ్రైవర్లకు ఆయన న మూనా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ ఈ పథకం ద్వారా రాజమహేంద్రవరం రూరల్ మండలంలో 2011 మందికి, కడియం మండలంలో 479 మం దికి, అర్బన్‌లో 8 వార్డుల్లో 510 మందికి ప్రయోజనం చేకూరిందన్నారు. నియోజకవర్గంలో ఆటో డ్రైవర్లకు రూ.4.50 లక్షల ఆర్థికసాయం వారి బ్యాంకు ఖాతాలకు ప్రభుత్వం జమ చేసిందని పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఓ వైపు సంక్షేమం, మరో వైపు అభివృద్ధికి సమ ప్రా ధాన్యమిస్తూ పాలన సాగిస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నేరుగా ఆటో డ్రైవర్ల ఖాతాల్లో సొ మ్ములు జమచేయడం కూటమి ప్రభుత్వ ప్రజాహిత దృక్పథానికి నిదర్శనమన్నారు. ఆటో డ్రైవర్లను వారి కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే కాకుండా రోడ్డు భద్రత, వాహన రిజిస్ట్రేషన్, పన్ను సడలింపులపై కూడా ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ మార్ని వాసుదేవరావు, డాక్టర్ గోరంట్ల రవిరామ్‌కిరణ్, టూరిజం డైరెక్టర్ వాసిరెడ్డి రాం బాబు, మత్యేటి ప్రసాద్, మజ్జి పద్మ, నియోజకవర్గ ప్రత్యేకాధికారి సరళవందనం, ఎంపీడీవోలు కేఎస్ ఆర్మ్‌స్ట్రాంగ్, కె.రమేష్ పాల్గొన్నారు.